Allu Aravind: అల్లు అరవింద్‌కు ఇచ్చిపడేసిన యశ్ ఫ్యాన్స్..మీ కొడుకు ఎవరకిి తెలుసంటూ..?

సినిమా ఇండస్ట్రీలో ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి. లేదంటే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వక తప్పదు. ఎవ్వరైనా సరే తమ హీరోను తక్కువ చేసి మాట్లాడితే ఫ్యాన్స్ ఇచ్చిపడేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తరవాత అభిమానులు తమ హీరోల జోలికి వస్తే నెట్టింట రచ్చ చేస్తున్నారు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా హీరో యశ్ అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తోంది. రీసెంట్ గా అల్లు అరవింద్ కోటబొమ్మాలి సినిమా టీజర్ లాంచ్ లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ…గ్యాప్ లేకుండా సినిమాలను ఎందుకు నిర్మించడం లేదు అనే ప్రశ్నపై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ వల్లనే బడ్జెట్ పెరిగిపోతుందని అన్నారు.

పెద్దగా తీసిన సినిమాల్లో కథానాయకులు ఉంటున్నారని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు అంటూ కేజీఎఫ్ రిచ్ నెస్ గురించి చెబుతూ….హీరో యశ్ గురించి కేజీఎఫ్ సినిమాకు ముందు ఎంత మందికి తెలుసని ప్రశ్నించారు. అల్లు అరవింద్ చేసిన కామెంట్లు యశ్ అభిమానులను నొప్పించాయి. నిజానికి యశ్ కన్నడలో సీరియల్ హీరోగా కెరీర్ ప్రారభించాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కండక్టర్ కొడుకుగా సీరియల్స్ లో కెరీర్ ప్రారంభించి ఆ తరవాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. కొన్ని చిన్న సినిమాలలో అవకాశాలు అందుకుని కేజీఎఫ్ లాంటి భారీ ప్రాజెక్టులో అవకాశం అందుకున్నాడు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వడంతో కెరీర్ లో తిరిగి వెనక్కి చూసుకోలేదు. వచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం రూ.50 కోట్ల పైనే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని యశ్ ఫ్యాన్స్ తెరపైకి తీసుకువచ్చారు. మీరు స్టార్ ప్రొడ్యూసర్ మీ కొడుకు మీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అసలు మీ కొడుకు హీరో అవ్వకముందు ఎంతమందికి తెలుసు…మీ చిన్న కొడుకు అయితే ఎన్ని సినిమాలు చేసినా స్టార్ అవ్వలేకపోతున్నాడు కదా….మీ ఫ్యామిలీలోని హీరోలు తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా..?

- Advertisement -

అంటూ ఓ రేంజ్ లో ఇచ్చిపడేస్తున్నారు. దాంతో అల్లు అర్జున్ అభిమానులు యశ్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. మా హీరో జోలికి రావద్దు అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. మరి అల్లు అరవింద్ ఈ వివాదం పై ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. అంతే కాకుండా హీరో యశ్ కూడా అల్లు అరవింద్ కామెంట్లను ఎలా తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు