Pavitra: ఎంగేజ్మెంట్ పిక్ షేర్ చేసి షాక్ ఇచ్చిన జబర్దస్త్ బ్యూటీ

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ కామెడీ స్టేజ్ నుంచి సిల్వర్ స్క్రిన్ చాలా మంది కామెడియన్స్ వెళ్లారు. అలాగే చాలా మంది తమ లైఫ్ లో సెట్ అయ్యారు. కొంత మంది సినిమా ఛాన్స్ లతో బిజీ అయిపోతే, మరి కొందరు పెళ్లి చేసుకుని, జబర్ధస్త్ షోనే కంటీన్యూ చేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ కామెడీ షోలోని ఓ లేడీ కామెడియన్ ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఆవిడ ఎవరో కాదు… గత కొన్ని రోజుల నుంచి అటు జబర్దస్త్, ఇటు శ్రీ దేవి డ్రామా కాంపెనీలో యాక్టివ్ గా ఉంటున్న పవిత్ర… ఇతర టీవీషోల్లోనూ కనిపిస్తుంది. అలాగే పలు యూట్యూబ్ ఛానల్స్ తోనూ పవిత్ర ఫేమస్ అవుతుంది.

అయితే జబర్దస్త్ షోతో లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న పవిత్ర ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తన ఎంగేజ్మెంట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. గత కొన్నాళ్లుగా యూట్యూబర్ సంతోష్ తో ప్రేమలో మునిగి తెలిన పవిత్ర ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ప్రియుడికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, కొన్ని నెలల క్రితం పవిత్ర ఒక పెళ్లీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పుడు అందరూ పవిత్ర పెళ్లి జరిగిపోయిందా అని అనుకున్నారు. కానీ, తర్వాత అది ఫ్రాంక్ వీడియో అంటూ పవిత్ర బాంబ్ పేల్చింది. కానీ, ఇప్పుడు యూట్యూబర్ సంతోష్ తో జరిగిన ఎంగేజ్మెంట్ ఫ్రాంక్ కాదని స్పష్టంగా తెలుస్తుంది. చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్న వీరు త్వరలోనే పెళ్లీ పీటలు ఎక్కబోతున్నారు. అయితే, పవిత్ర తన పెళ్లి తేదీని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు