Trivikram: త్రివిక్రమ్ పుట్టినరోజుకు లగ్జరీ ఇల్లు కొనిచ్చిన స్టార్ హీరో..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. కెరీర్ మొదట్లో సినీ రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు దర్శకుడిగా మారి ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా పేరు తెచ్చుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పరిశ్రమలో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

జల్సా చిత్రం కోసం కలిసిన వీరి స్నేహం దశాబ్దాలుగా కొనసాగుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. త్రివిక్రమ్ తన గురువని పవన్ కళ్యాణ్ పలు పబ్లిక్ వేదికలలో కూడా చెప్పడం కోసం మెరుపు. పురాణాలు, తెలుగు భాష మీద త్రివిక్రమ్ కి విపరీతమైన పట్టు ఉందని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ అన్నారు. అయితే ఇటీవల త్రివిక్రమ్ తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ బంజారాహిల్స్ లో 6 కోట్ల రూపాయల విలువచేసే ఓ అందమైన ఇల్లుని బహుమతిగా ఇచ్చాడట.

ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్తలలో నిజం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కి సినిమాలు సెట్ చేసే విషయంలో త్రివిక్రమ్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఇలా తన పట్ల ఇంత ప్రేమ, శ్రద్ద చూపిస్తున్నందుకు పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పుట్టినరోజు సందర్భంగా కోట్ల విలువ చేసే ఓ ఇల్లుని బహుమతిగా ఇచ్చారంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు