Guntur Karam: వేరే ప్రొడ్యూసర్స్ ని నేనెందుకు వెళ్లి అడుగుతా

ప్రతి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో సినిమాలో రిలీజ్ కావటం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఎందుకంటే సంక్రాంతికి ఒక సినిమాను రిలీజ్ చేస్తే అప్పుడు వచ్చే రెవెన్యూ మిగతా టైమ్స్ కంటే కూడా ఎక్కువగా వస్తుందని ఫుల్ క్లారిటీ ఉంటుంది దర్శక నిర్మాతలకు. అందుకోసమే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు అన్ని  సంక్రాంతికి తమ సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి వస్తుందంటే శ్రీ వెంకటేశ్వర బ్యానర్ నుండి ఖచ్చితంగా ఒక సినిమా రిలీజ్ రెడీగా ఉంటుంది. అలానే రీసెంట్ టైమ్స్ లో సంక్రాంతి టైం కి సినిమాలు రిలీజ్ చేయడంలో “హారిక హాసిని క్రియేషన్స్” కూడా పూనుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి.  ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగానే రిలీజ్ చేశారు.  కానీ ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా అనుకున్న ఫలితం ఇవ్వని టైంలో వెంటనే అరవింద సమేత వీర రాఘవ సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్.  సంక్రాంతి పోయిన విజయాన్ని విజయదశమి వెతుక్కుని అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

ఆ సినిమా తరువాత  త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేసిన  “అలవైకుంఠపురంలో” అనే సినిమాను ఆ సంక్రాంతికి రిలీజ్ చేశారు. ఆ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ ను కూడా తెలుగులో బీట్ చేసే రేంజ్ లో కలెక్ట్ చేసింది.  ప్రస్తుతం ఇప్పుడు మళ్లీ సంక్రాంతి బరిలో త్రివిక్రమ్ సినిమా రానుంది.  త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం.  ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది.  కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక పాట కూడా రిలీజ్ కాలేదు.

- Advertisement -

రీసెంట్ గా ఆదికేశవ పోస్ట్ పోన్ గురించి జరిగిన ఒక ఇంట్రాక్షన్ లో  నాగ వంశీ కి ఒక ప్రశ్న ఎదురైంది.  సంక్రాంతికి ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదా ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకున్నారా.?   ఏ సినిమా పోస్ట్ పోన్ చేయాలని.? అనే ప్రశ్నకు నేనెందుకు అందరి ప్రొడ్యూసర్స్ తో మాట్లాడుతాను, అందరి ప్రిఫరెన్స్ గుంటూరు కారం సినిమా మీద ఉంది కాబట్టి మిగతా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడాలని అంటూ మీడియాకు  సమాధానం ఇచ్చాడు నాగ వంశీ.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmifymahesh babu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు