Mahesh babu: గుంటూరు కారం ఘాటు మాములుగా లేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ సినిమా గుంటూరు కారం  బిజినెస్ లెక్కలు బయటపడ్డాయి. గత కొద్దీ రోజులుగా నిత్యం ఎదో ఒక న్యూస్ తో వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమా వివాదాల పరంగా ఎలా ఉన్న ప్రి రిలీజ్ బిజినెస్ మాత్రం గట్టిగ జరుగుతోంది.

ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలనే ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా పలు ఇంటర్వ్యూలలో గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ సినిమా రిజల్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలిపారు.

ఇక గుంటూరు కారం సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే కేవలం ఏపీ , తెలంగాణలోనే ఈ సినిమా 120 కోట్ల వరకు మార్కెట్ జరగబోతున్నట్టు తెలుస్తుంది. కేవలం నైజాం ఏరియాలోని 45 కోట్ల రేషియో తో బిజినెస్ జరగబోతుందని సమాచారం అందుతోంది. ఇక ఆంధ్ర లో 60 కోట్లు , రాయలసీమ లో 15 కోట్ల వరకు బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. సంక్రాంతి తెలుగు రాష్టాలలో పెద్ద పండగ అవడం. మరియు మహేష్ బాబు కు ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉండటంతో గుంటూరు కారం లెక్కలు మరింత పెరిగిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికి గుంటూరు కారం సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు వచ్చిన బిజినెస్ పరంగా మాత్రం ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు