Prabhas: రీ- రిలీజ్ రేస్ లో ప్రభాస్ మరో సినిమా

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గత సూపర్ హిట్ చిత్ర మొకటి రీ- రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది. టాలీవుడ్ లో ఇటీవలనే స్టార్ట్ అయిన రీ- రిలీజ్ ట్రెండ్ ను ప్రేక్షకులు అమితంగా ఆదరిస్తుండగా మేకర్స్ కూడా సినిమాల రీ- రిలీజ్ విషయంలో ఆలోచించకుండా 4k మాస్టరింగ్ తో థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఒరిజినల్ సినిమా రిలీజ్ కలెక్షన్స్ మించేలా స్టార్ హీరోల సినిమాలు రీ- రిలీజ్ అయ్యి, సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్నాయి.

ఇక ఈ ట్రెండ్ లో భాగంగా ఇప్పటికే ప్రభాస్ గత చిత్రాలైన రెబెల్, వర్షం, యోగి, బిల్లా సినిమాలు రీరిలీజ్ అయ్యి ఆయన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగా. లేటెస్ట్ గా ప్రభాస్ మరో చిత్రం రీ- రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఆ సినిమా మరేదో కాదు.. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఛత్రపతి.

అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టినరోజు వస్తోన్న సందర్భంగా ఛత్రపతి సినిమాను రీ- రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. 2005 లో రిలీజైన ఈ ఛత్రపతి సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించి, ప్రభాస్ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచింది. ఇక అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా మళ్ళీ రీ- రిలీజ్ అవడం ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు