Vikram: తంగలాన్ కథ దాని గురించే?

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటిస్తున్న “తంగలాన్” సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రయోగాలకి పెట్టింది పేరైన విక్రమ్ నటిస్తున్న మరో విభిన్న కథాంశమున్న చిత్రమే ఈ తంగాలాన్. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండి సినిమాపై అభిమానుల్లోనే కాదు, కామన్ ఆడియన్స్ లో కూడా సాలిడ్ బజ్ ఏర్పడింది.

పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా తంగలాన్ టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ చూసాక చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ కి అనిపించినా లాస్ట్ లో డైరెక్టర్ ఒక హింట్ ఇచ్చాక సినిమా కాన్సెప్ట్ గురించి ఆడియన్స్ కి ఒక ఐడియా వచ్చేసింది.

తంగలాన్ టీజర్ లో ని చూసాక కథ 18వ శతాబ్దానికి చెందిన కథ నేపథ్యంలో జరుగుతుందని తెలియగా, లాస్ట్ లో బంగారపు నేల ని చూపిస్తూ టీజర్ ఎండ్ చేసాడు. ఇక ఆ నేలపై నిల్చున్న హీరో చేతిలో ఉన్న కత్తి నుండి రక్తం నేలపై పడుతుంటే ఆ రక్తం కూడా బంగారం గా మారిపోవడం గమనించొచ్చు. దీన్ని బట్టి కథ నేపథ్యం మొత్తం బంగారం చుట్టూనే జరుగుతుందని డైరెక్టర్ ముందే హింట్ ఇచ్చాడని అర్ధమైపోతుంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే తంగలాన్ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు