Chiyaan Vikram: తంగలాన్.. విక్రమ్ కెరీర్ లో మరో మైలు రాయి…

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రయోగాలకి పెట్టింది పేరైన విక్రమ్ ‘శివ పుత్రుడు నుంచి నిన్నటి పొన్నియిన్ సెల్వన్’ దాకా తన సినిమాలతో మూవీ లవర్స్ ని అలరిస్తూనే ఉన్నాడు. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికైనా రెడీ అయ్యే హీరోల్లో విక్రమ్ ఒకరు.

ఇక విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో “తంగలాన్” ఒకటి. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న “తంగలాన్” సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకున్న తంగలాన్ టీజర్ రిలీజ్ అయ్యాక మూవీ పై ఉన్న అంచనాలని మరింత పెంచిందని చెప్పొచ్చు.

టీజర్ చూసాక ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పూర్తి స్థాయి విక్రమ్ మూవీ అని చెప్పొచ్చు. టీజర్ అన్ని లాంగ్వేజ్ లకు అనుకూలంగా మాటలేవి లేకుండా రిలీజ్ చేయగా చివర్లో రిలీజ్ డేట్ తో ఎండ్ చేసారు.

- Advertisement -

ఇక సినిమా 18వ శతాబ్దానికి చెందిన నేపథ్యంలో కథ జరుగుతుందని తెలుస్తుంది. సినిమాలో అప్పటి విదేశీయుల పాత్ర కూడా ఉంటుందని టీజర్ లో కొందరి లుక్స్ ని బట్టి తెలుస్తుంది. ఇక విక్రమ్ తంగలాన్ లో కనిపించిన తీరు మామూలుగా విక్రమ్ తప్ప ఎవ్వరూ చేయలేరని అనిపిస్తుంది. పైగా టీజర్ లాస్ట్ లో ఆ బ్లడ్ పడే సీన్ లో విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ మామూలు కాదు.

టీజర్ లో డైలాగ్స్ ఏమి లేకపోయినా విక్రమ్ తన అభినయంతో ఆకట్టుకున్నాడు. అయితే టీజర్ చూస్తున్నంత సేపు కొంతమంది ఆడియన్స్ కి ఆది పినిశెట్టి నటించిన ‘ఏకవీర’ సినిమా గుర్తు రాక మానదు.

ఇక ఈ టీజర్ లో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే తంగలాన్ సినిమా ఓ ప్రాంతానికి సంబంధించిన బంగారం కోసం జరిగే వేటగా కథ లో చెప్తున్నారని అనిపిస్తుంది. దీనిపై హింట్ ఇస్తూ టీజర్ ఎండింగ్ లో ‘సన్ అఫ్ గోల్డ్’ అని కూడా చెప్పారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు