సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్నగుంటూరు కారం సినిమా గురించి తెలిసిందే. ఇటీవల కాలంలో పలు వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి వార్త సంచలనంగా మారుతోంది. నిన్నటి మొన్నటి వరకు గుంటూరు కారం సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటికి వచ్చి, అందరిని ఆశ్చర్య పరచగా లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది.
ఇక ఆ ఇన్ఫర్మేషన్ ను బట్టి చూస్తే టాలీవుడ్ లో అత్యంత క్రేజ్ ఉన్న మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ కు గుంటూరు కారం సినిమా మచ్చుతునక అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదనిపిస్తోంది. ఎందుకంటే.. గుంటూరు కారం సినిమా ఎనౌన్స్ చేసినపుడు వచ్చిన బజ్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచితే.. ఆ తరువాత హీరోయిన్ పూజ హెగ్డే సినిమా నుంచి తప్పుకోవడం, అలాగే సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్స్ ఇలా ఒక్కొకరుగా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగిన గుంటూరు కారం సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదని చెప్పొచ్చు.
ముందు నుంచి గుంటూరు కారం సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని మాట ఇచ్చిన మేకర్స్ ఎలాంటి అడ్డాకులు, అవరోధాలు వచ్చిన అదే మాటకు కట్టుబడి ఉండి.. సంక్రాంతి రేస్ లో గుంటూరు కారం ను బరిలో దింపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ దసరా కానుగ ఈ సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేయబోతున్న మేకర్స్..సాంగ్ రిలీజ్ తరువాత నుంచి జోరుగా ప్రమోషన్స్ చేయడానికి రెడీ అయ్యారు. ఒక్కసారిగా గుంటూరు కారం సినిమా నుంచి విజువల్స్ బయటకు వస్తే సంక్రాంతి రేస్ లో ఉండే సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటాయి మూవీ టీం ధీమాగా ఉన్నట్టు తెలుస్తుంది. దసరా తరువాత నుంచి గుంటూరు కారం సినిమా అప్డేట్స్ ను కంటిన్యూస్ గా అందిస్తూ సంక్రాంతి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ లను సిద్ధం చేస్తున్నారట. మరి ఇదే గనక నిజమైతే సంక్రాంతి బుల్లోడు మహేష్ అవుతాడని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదనిపిస్తోంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.