Anushka: అనుష్క ఆ డైరెక్టర్ ని అలా మోసం చేసిందా..?

సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్క శెట్టి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సూపర్ సినిమా నుండి సింగం దాకా.. అరుంధతి నుండి రుద్రమదేవి దాకా.. ఏ క్యారెక్టర్ అయినా పర్ఫెక్ట్ గా నటించే హీరోయిన్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టిదే. అంతలా వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది అనుష్క. తన అందం, అభినయం, విజయాలతో హీరోలకు సమానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది.

ఈమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు సైతం తిరుగులేని విజయాలను సాధించాయి. అయితే కొద్ది కాలం పాటు ఏమైందో తెలియదు కానీ పూర్తిగా సినిమాలకు దూరమైంది అనుష్క. ఇటీవల “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అయితే తాజాగా అనుష్కకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ డైరెక్టర్ ని మోసం చేయడం వల్లే ఇంత పెద్ద పొజిషన్ కి వచ్చిందని నెట్టింట చర్చ జరుగుతుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు నేను యోగా క్లాస్ చెప్పేదాన్ని. నాకు టీవీలు, సినిమాలు అంతగా ఇష్టం ఉండేది కాదు. కానీ నేను ఇండస్ట్రీకి సంబంధం ఉన్న నివాస్ భార్యతో ఫ్రెండ్షిప్ చేసేదాన్ని. మేమిద్దరం యోగ ఫ్రెండ్స్. నివాస్ కి ఇండస్ట్రీకి చెందిన శ్రీను అనే వ్యక్తి తెలుసు. అలా శ్రీను నన్ను చూసి ఓ రోజు పూరి జగన్నాథ్ ని కలవమని చెప్పారు. ఓ రోజు పూరి జగన్నాథ్ కి ఫోన్ చేయమని చెబితే నేను ఫోన్ చేశానని వారిని చీట్ చేశాను. కానీ నేను అబద్ధం చెబుతున్నట్టు వారికి తెలిసిపోయింది.

- Advertisement -

అలా బలవంతంగా ఫోన్ చేయవలసి వచ్చింది. అలా పూరి జగన్నాథ్ ఓ సినిమాల అవకాశం ఉందని నాకు చెప్పారు. ఓ ఫోటో పంపించమని అడిగారు. అప్పుడు నేను నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపించడంతో అది చూసి పూరి జగన్నాథ్ నవ్వి అక్కడినుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు నాకు ఆ డైరెక్టర్ నుండి ఫోన్ వచ్చింది. నా సినిమాలో మీకు క్యారెక్టర్ ఉంది.. వెంటనే హైదరాబాద్ రావాలన్నారు. కానీ నేను నాకు యోగ క్లాసులు ఉన్నాయని.. అవి చూసుకుని వీలైనప్పుడు వస్తానని చెప్పాను” అంటూ తనకు ఇండస్ట్రీలో ఎలా అవకాశం వచ్చిందో చెప్పుకొచ్చింది అనుష్క.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు