Shruti Haasan: దిక్కుతోచని స్థితిలో తల్లి… పట్టించుకోని స్టార్ హీరోయిన్

ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను దయనీయ పరిస్థితులలో కొంతమంది వదిలివేయడం చూస్తూనే ఉన్నాం. పరిస్థితుల ప్రభావం రీత్యా అంటే డబ్బు లేక కొంతమంది అలా చేస్తుంటే, మరి కొంతమంది బుద్ధిలేక అలా చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా రూపాయి చేతిలో లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తన తల్లిని అలాగే గాలికి వదిలేసిందట. ఆమె ఎవరో కాదు సలార్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న శృతిహాసన్. 

అలనాటి స్టార్ హీరోయిన్ సారిక – కమల్ హాసన్ దంపతులకు శృతిహాసన్ జన్మించిన విషయం తెలిసిందే. ఆమెకు అక్షర హాసన్ అనే చెల్లెలు కూడా ఉంది. ఇక కమల్, సారిక ఎప్పుడో విడిపోగా పిల్లలు మాత్రం తన తండ్రి దగ్గరే పెరుగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శృతిహాసన్ చాలా కాలం నుంచి తల్లికి దూరంగా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ కమల్ మాజీ సతీమణి సారిక రీసెంట్ గ్స్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో సారిక మాట్లాడుతూ తన పెద్ద కుమార్తె తనను దూరం పెట్టిందని, తన దగ్గరికి రావడం పూర్తిగా మానేసిందని, ఆ సమయంలోనే లాక్ డౌన్ కూడా విధించారని తెలిపింది.

అయితే అప్పుడు తనకు తినడానికి తిండి కూడా లేదనీ, చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితి నెలకొనడంతో తాను కమల్ హాసన్ కు కాల్ చేస్తే, అసలు పట్టించుకోలేదంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఇప్పటికీ కూడా సారిక ముంబైలో రూమ్ రెంట్ కట్టుకుంటూ ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ‘సలార్’ రిలీజ్ నేపథ్యంలో సారిక ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయితే ఏం లాభం, ఇలా దిక్కుతోచని స్థితిలో ఉన్న కన్నతల్లిని పట్టించుకోవట్లేదు అంటే ఆమె అభిమానిగా ఉండడం సిగ్గుచేటు అంటూ శృతిహాసన్ ను ఏకిపారేస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం ఇలాంటి పరిస్థితిలో తల్లిని దూరం పెట్టడం కరెక్ట్ కాదని, ఆమెను కూడా శృతి తన దగ్గరే ఉంచుకోవడం మంచిదని సలహాలు ఇస్తున్నారు. శృతిహాసన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే… ఈ ఏడాది ఆమె ఖాతాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ సలార్’ లో ఈ బ్యూటీ హీరోయిన్ గా కనిపించబోతోంది. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీ పాన్ ఇండియా హీరోయిన్ గా శృతిహాసన్ భవితవ్యం ఏంటో తేల్చేయనుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు