Ananya: ఇండస్ట్రీలోని రేసులో నిలవాలంటే… అవి చేయాల్సిందే అంటున్న అనన్య

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వచ్చే వారు వస్తుంటారు… పోయే వారు పోతుంటారు. కానీ, టాలెంట్ ఉన్నవాళ్లే నిలబడతారు. ఇది నిజమే కానీ, ప్రస్తుతం టాలెంట్ తో పాటు హీరోయిన్స్ కి ఇంకా చాలా కావాలి. అందులో గ్లామర్ షో, అందాల ఆరబోత ముఖ్యం. ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకుంది తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల. ప్రియదర్శి హీరోగా చేసిన మల్లేశం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనన్యకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీతో మంచి నేమ్ వచ్చింది.

మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో అనన్య నాగళ్ల వద్ద చాలా టాలెంట్ ఉందని తెలిసింది. ఫస్ట్ చెప్పుకున్నట్టు టాలెంట్ ఒక్కటే సరిపోదు కదా… గ్లమర్ షోను మొదట్లో పెద్దగా నమ్ముకోకపోవడంతో ఎక్కువగా అవకాశాలు రాలేదు. తాజాగా టాలెంట్ తో పాటు అందాల ఆరబోత కూడా ఉండాలని తెలుసుకున్న అనన్య నాగళ్ల… తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ గ్లామర్ ఫిక్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఈ బ్యూటీకి వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి.

తాజాగా ఈమె అన్వేషి అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అందుకు గాను ఈ సినిమా ప్రమోషన్స్ పనులు బిజీగా జరుగుతన్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన ఇన్ స్టాగ్రామ్ లో వస్తున్న గ్లామర్ ఫోటోలపై అనన్య నాగళ్ల స్పందించింది. వకీల్ సాబ్ సినిమా వరకు తాను ట్రెడీషనల్ గానే ఉండేదాన్ని అని, అప్పటి వరకు టాలెంట్ ను మాత్రమే నమ్ముకున్నట్టు చెప్పింది. కానీ, ఇండస్ట్రీలో ఉన్న రేసులో నిలవాలంటే.. టాలెంట్, ట్రెడీషనల్ మాత్రమే కాదు.. గ్లామర్ డోస్ కూడా పెంచాలని తెలుసుకున్నట్టు చెప్పుకొచ్చింది. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటోలను ఎక్కువ షేర్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు