Hansika Motwani: చరణ్ ఫ్యాన్స్‌ని గెలికేసిన హన్సిక… ఇక తట్టుకుంటుందా?

టాలీవుడ్ టాప్ డ్యాన్సర్ ఎవరు?
ఈ ప్రశ్నకు ఆప్షన్స్..
a) రామ్ చరణ్ b) అల్లు అర్జున్ c) జూనియర్ ఎన్టీఆర్.
ఇలాంటి ప్రశ్న ఏ సెలబ్రెటీకి వచ్చినా పాస్ అనే ఆన్సర్ తప్పా ఇంకేమీ రాదు. అలా కాకుండా, ఇందులో ఏ ఒక్క ఆప్షన్ ఇచ్చినా.. మిగితా హీరోలా అభిమానులు హార్ట్ అవుతారు. ఆ సెలబ్రెటీని ట్రోల్ చేస్తారు. ఎందుకంటే.. ఈ ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలేస్తున్న స్టార్ హీరోలు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినవాళ్లు. ఇటు యాక్టింగ్ లో, డ్యాన్స్ లో ఈ ముగ్గురు తర్వాతే ఎవరైన. అందుకే ఈ ముగ్గురు గురించి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సెలబ్రెటీలు చాలా జాగ్రత్తగా స్కిప్ చేస్తూ ఉంటారు.

కానీ, ఇది తెలియని హన్సిక మాత్రం బుక్ అయిపోయింది. ప్రస్తుతం ఫ్యాన్స్ తో ట్రోల్స్ ని ఎదుర్కొంటుంది. అసలేమైందంటే.. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్న హన్సిక, తాజాగా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది. లేటెస్ట్ గా ఈమె గార్డియన్ అనే హర్రర్ నేపథ్యంలో సాగే సినిమా చేసింది. ఇది త్వరలోనే విడుదల కాబోతుంది. అందుకు గాను చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో హన్సిక ఒక ఇంటర్వ్యూకి వెళ్లాల్సి వచ్చింది.

అక్కడ రాపిడ్ ఫైర్ లో టాలీవుడ్ బెస్ట్ డ్యాన్స్ ఎవరు అంటూ.. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు ఆప్షన్ గా ఇచ్చారు. హన్సిక ఏ మాత్రం ఆలోచించకుండా, తారక్, బన్నీ డ్యాన్స్ బాగుంటుందని, అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అంతే గానీ, రామ్ చరణ్ డ్యాన్స్ గురించి, రామ్ చరణ్ గురించి అసలేం మాట్లాడలేదు. ఈ ఆన్సర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీంతో హన్సిక పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

అల్లు అర్జున్, తారక్ తో నటించావని వారి పేర్లే చెబుతావా? నువ్వు ఎప్పుడైనా రామ్ చరణ్ డ్యాన్స్ చూశావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, హన్సికపై చరణ్ ఫ్యాన్స్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. కాగా, హన్సిక, అల్లు అర్జున్ కాంబినేషన్ లో దేశ ముదురు సినిమా వచ్చింది. అలాగే తారక్, హన్సిక ఇద్దరు కలిసి కంత్రి సినిమాలో నటించారు. కానీ, రామ్ చరణ్ తో ఇప్పటి వరకు హన్సిక ఒక్క సినిమా కూడా చేయలేదు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు