Ananya Panday comments: అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా -లైగర్ బ్యూటీ

Ananya Panday comments

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన కాబోయే వాడు ఎలా ఉండాలనే విషయం పై క్లారిటీ ఇచ్చింది.విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనన్య పాండే ఇటీవలనే ఆమె నటించిన డ్రీం గర్ల్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలో మీడియాకు వివరించి వార్తల్లో నిలిచింది.

టైగర్ ష్రాఫ్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీకి బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా సినిమాలలోకి వచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన, అందం నటనతో అందరిని ఆకట్టుకొని తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది.

ప్రస్తుతం నటుడు ఆయుష్మాన్ ఖురానా తో డ్రీం గర్ల్ 2 సినిమాలో నటిస్తున్న అనన్య పాండే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటోంది. ఆగస్ట్ 25న ఈ సినిమా రిలీజ్ అవబోతుండటంతో మూవీ టీం జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. కాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న అనన్య పాండే ను ప్రముఖ విలేకరి మీకు ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండలనుకుంటున్నారు అని అడగగా ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది. “పెళ్లి విషయంలో నాకు మా నాన్నే ఆదర్శమని చెబుతూ.. మా నాన్నలాగా ప్రేమగా, ఫన్నీగా, దయాగుణం ఉండే జెంటిల్ మెన్ అయ్యి ఉండాలి. అలాంటి అబ్బాయి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటా” అని ఆమె చెప్పుకొచ్చింది.

- Advertisement -

అయితే విలేకరి ఈ ప్రశ్న అడగటానికి ప్రధాన కారణం ఆమె గతకొద్ది రోజులుగా ఆశికీ 2 సినిమా ఫేం ఆదిత్య రాయ్ కపూర్ తో అనన్య పాండే డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తుండటంతో ఆమె చేత నిజం చెప్పించాలని ఉద్దేశ్యంతో ఈ ప్రశ్న అడిగగా అనన్య పాండే, తన బాయ్ ఫ్రెండ్ పేరు బయట పెట్టుకుందా తెలివిగా సమాధానం ఇచ్చింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు