Pawan kalyan’s OG : ఓజి టీజర్ కి వాయిస్ ఓవర్ ఎవరిస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు

Pawan kalyan’s OG

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజి సినిమా టీజర్ మరికొద్ది రోజుల్లో విడుదలవబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండగా.. సుజీత్ ఈ సినిమా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ఇండస్ట్రీల నుంచి మంచి క్రేజ్ ఉన్న పలువురు నటీనటులను ఓజి సినిమాలో ఇంక్లూడ్ చేసిన సుజీత్, ఇక త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్న ఓజి సినిమా టీజర్ వాయిస్ ఓవర్ లో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దానయ్య డివివి నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిచబడుతున్న ఓజి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే యాభై శాతం కంప్లిట్ చేసుకొని తొందర్లోనే మరో కొత్త షెడ్యూల్ తో సినిమా షూట్ మొదలవనుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రియ రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవ్వబోతున్న ఓజి సినిమా టీజర్ కు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గాను బేస్ వాయిస్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే తమిళ నటుడు అర్జున్ దాస్ ను సుజీత్ ఫైనల్ చేసినట్టు సమాచారం అందుతోంది. దాదాపు 40 సెకన్ల పాటు ఉండే ఓజి సినిమా టీజర్ ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా ఉండబోతుందని టాక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్నబ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో ఎక్కువ హైప్ ఉన్నసినిమా ఓజి నే. ఇటీవలనే రిలీజైన బ్రో సినిమాతో నీరాశలో ఉన్న పవన్ ఫ్యాన్స్ ను మరి ఓజి సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు