Vennela Kishore new movie : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వెన్నెల కిశోర్

Vennela Kishore new movie

టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిశోర్ మొత్తానికి ఇన్నాళ్లకు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. బార్కట్​ స్డూడియోస్​ బ్యానర్​పై అడితి సోని నిర్మిస్తున్న చారి 111 అనే పేరుతో వెన్నల కిషోర్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. హీరో సుమంత్ నటించిన మళ్ళీ మొదలైంది సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన కీర్తి కుమార్ ఈ చారి111 సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మురళి శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

గతంలో టాలీవుడ్ కమెడియన్ లు చాలా మంది హీరోలుగా పరిచమై.. సక్సెస్ అయిన విషయం అందరికి తెలిసిందే కానీ ఆ సక్సెస్ కొద్దీ సినిమాలకు మాత్రమే పరిమితమైంది. కథలో విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆయా కమెడియన్స్ హీరోలుగా ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. ఇక లేటెస్ట్ గా వెన్నెల కిశోర్ కూడా ఇన్నాళ్లకు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. చాలా సినిమాల్లో హీరోతో సమానమైన పాత్రలను పోషించి ఆయా సినిమాలు హిట్ అవడానికి కారణమైన కిషోర్.. ఇప్పుడు  హీరోగా చేస్తుండటంతో ఇండస్ట్రీ నుంచి వెన్నల కిషోర్ సినిమాకు మంచి సపోర్ట్ లభిస్తోంది.

అయితే ఈ చారి 111 సినిమాలో వెన్నెల కిశోర్ అందరిలాగా ఫైట్స్ చేసే హీరోలుగా కాకుండా ఎప్పటిలాగే కామెడీ చేసి, నవ్విచే పాత్రలోనే కనిపించబోతున్నట్టు కాసేపటి క్రితం రిలీజైన మూవీ ఎనౌన్స్ మెంట్ వీడియో ద్వారా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిశోర్ కు జోడిగా సంయుక్త విశ్వనాథన్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. స్పై యాక్షన్ కామెడీ జానర్ లో ఈ సినిమా రాబోతుంది. ప్రమాదంలో ఉన్న సిటీని కాపాడటానికి ప్రయత్నించే ఒక తింగరి స్పై పాత్రలో వెన్నెల కిషోర్ అందరిని నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తునట్టు టాక్.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు