Ananya Panday : ప్రేమ‌లో పడిందా ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందాల ప్రదర్శనలో మిగతా హీరోయిన్లతో ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటుంది. తాజాగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన “లైగర్” మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. “స్టూడెంట్ ఆఫ్ ది 2” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా బాలీవుడ్ లో దూసుకుపోతోంది.

తాజాగా అనన్య పాండే గురించి ఓ రూమర్ తెగ వైరల్ గా మారింది. అనన్య పాండే ప్రేమలో పడిందా? అంటే అవుననే గుసగుసలాడుకుంటున్నారు బీటౌన్ సినీ ప్రియులు. హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో అనన్య ప్రేమలో ఉందని పేర్కొంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. దీంతో వీళ్లిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కొంతకాలంగా ఆదిత్య హీరోయిన్ అనన్యతో ఎక్కువగా కనిపిస్తున్నాడు. సెలబ్రిటీ పార్టీలలోనూ జంటగా వీరిద్దరూ హాజరవుతుండడంతో వీరు ప్రేమలో ఉన్నారనే అనుమానాలకు బలం చేకూరింది. ఇదేకాక ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అనన్య పాండే తనకి ఆదిత్య అంటే ఇష్టమని.. చాలా అందంగా ఉంటాడని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరినట్టు అయింది. మరి ఈ వార్తలపై అనన్య పాండే ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు