Sunil: విలన్ గా సునీల్.. ఆ రేంజ్ లో డిమాండ్.. తగ్గేదేలే..!

ఒకానొక సమయంలో కమెడియన్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారిన సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇక ఇటీవల కలర్ ఫోటో సినిమా ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఏకంగా పాన్ ఇండియా సినిమా పుష్ప తో విలన్ గా సత్తా చాటి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు.హీరోగా, విలన్ గా, కమెడియన్ గా ఇలా ఏ పాత్రలో అయినా సరే తనదైన ప్రతిభ కనబరుస్తూ.. తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్న సునీల్ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వివిధ భాషలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
అంతేకాదు భారీగా డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో పారితోషకం కూడా పెంచినట్లు తెలుస్తోంది.ఇకపోతే స్టార్ హీరోల సినిమాలకు విలన్ గా పనిచేస్తూ తెలుగు , తమిళ్ అంటూ చాలా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్న సునీల్ ఏకంగా స్టార్ హీరోల సినిమాలలోనే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం.ఈ క్రమంలోనే పారితోషకం కూడా భారీగా పెంచేశారు.కెరియర్ మొదట్లో కమెడియన్ పాత్రలు చేసినప్పుడు ఒక్కో సినిమాకు రూ .10 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ఈయన.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాతో హీరోగా మంచి పేరు దక్కించుకున్న సునీల్ ఆ తర్వాత కూడా హీరో గానే కంటిన్యూ అవుతూ ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు.అయితే హీరోగా ఆ తర్వాత చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేదు.దీంతో మళ్లీ కమెడియన్ గా పనిచేసిన ఈయన ఆ తర్వాత విలన్ గా అవతారం ఎత్తారు.
ఇకపోతే కలర్ ఫోటో , పుష్ప, జైలర్ సినిమాలలో విలన్ గా కనిపించిన ఈయనకు మంచి క్రేజ్ లభించింది.టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ లో కూడా విలన్ పాత్రలు ఈయనకు క్యూ కడుతున్నాయి.దీంతో ఒక్క రోజుకు రూ.6 లక్షల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఏది ఏమైనా విలన్ గా మారిన తర్వాత సునీల్ డిమాండ్ బాగా పెరిగిపోయింది.అందుకే పారితోషకం విషయంలో ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తూ స్టార్ హీరోలకి కూడా పోటీగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.ఇక మునుముందు కూడా ఇదే రేంజ్ లో అవకాశాలు దక్కించుకొని మరింత బిజీగా మారాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు