Shivaji: నేను, నా భార్య చనిపోవాలనుకున్నాము.. కానీ…

ప్రముఖ సీనియర్ హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో వరుస సినిమాలు చేసి భారీ విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత ఏడేళ్ల పాటు వరుసగా ఫ్లాప్ లు చవి చూశాడు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శివాజీ ని బుల్లితెర ప్రేక్షకులు తెగ ఓన్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను తన భార్య ఎప్పుడో చనిపోవాలని అనుకున్నామని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

శివాజీ మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఇక ఉదయ్ కిరణ్ లాంటి వ్యక్తి మరణించడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. ఉదయ్ కిరణ్ లాంటి బాధను నేను కూడా అనుభవించాను. నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండి ఉంటే కచ్చితంగా ఒక 30 సార్లు అయినా చనిపోయి ఉండే వారిని కూడా శివాజీ కామెంట్లు చేశారు. దీన్ని బట్టి చూస్తే శివాజీ ఎన్నిసార్లు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారో అర్థం చేసుకోవచ్చు. తాను రేపటి గురించి ఆలోచించనని .. 10 సంవత్సరాల తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నదానిపై ఆశలు అసలే పెట్టుకోనని.. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటానని శివాజీ తెలిపారు .

సినిమాలు బాగుండి కూడా అవి డిజాస్టర్ అవుతూ ఉంటే తట్టుకోలేకపోయారని ఆ సమయంలో రెండు మూడుసార్లు చచ్చిపోవాలని ఆలోచనలు కూడా వచ్చాయని.. తాను తన భార్య కలిసి ఏడ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని.. అవన్నీ తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్నామని ఎమోషనల్ అయ్యారు శివాజీ. నిర్మాతలకు ఖర్చు కాకుండా ఎన్నో సలహాలు చెప్పేవాడిని.. అయితే ఎవరు కూడా నా మాటలు పట్టించుకునేవారు కాదు.. అలాంటి సమయంలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.. మీకు అన్ని తెలివితేటలు ఉంటే మీ తాజ్ మహల్ సినిమా ఎలా ఫ్లాప్ అయిందని ముఖం మీద అనేవారు.. దానివల్ల వారికి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయే వాడిని..

- Advertisement -

సినిమాకి ఎంత ఖర్చు పెట్టి తీసాం అన్నది కాదు పబ్లిసిటీ ఎంత ఎక్కువ చేసామన్నదే ముఖ్యము.. అందుకే ఇదే విషయాన్ని నిర్మాతలకు ఎప్పుడూ చెప్పేవాడిని. తాజ్ మహల్ సినిమా సమయంలో నా మానసిక పరిస్థితి బాగోలేనప్పుడు నా భార్య గమనించి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి తెలిపింది.

అయితే ఆ ఫ్రెండ్ మనస్ఫూర్తిగా స్పందించలేదు. ఇక ఎవరూ కూడా మమ్మల్ని పలకరించలేదు . ఆర్థిక సహాయం కోసం మాత్రమే వస్తారు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఎవరు ముందు ఉండరు అంటూ శివాజీ తెలిపారు. అందుకే ఎంత కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఉండడం నేర్చుకున్నాము అంటూ శివాజీ తెలిపారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు