Naga Chaitanya: ఆ తప్పే నాగచైతన్య కెరియర్ ను నాశనం చేసిందా..?

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో కథలు వినేటప్పుడు ఒకసారి కథ నచ్చితే సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ నచ్చకపోతే ఆ సినిమాను వదిలేస్తారు. అయితే అదే సినిమాను వేరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పుడు బాధపడుతూ ఉంటారు. అయితే అలా నాగచైతన్య కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు. ఒకవేళ అవే గనుక చేసి ఉంటే నేడు ఆయన కెరియర్ స్టార్ హీరో రేంజ్ లో కొనసాగేది. ఇకపోతే నాగచైతన్య వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఇప్పుడు చూద్దాం..

కొత్త బంగారులోకం:
కొత్త బంగారులోకం సినిమాతోనే నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే సాఫ్ట్ రోల్ అనే ఒక ఆలోచనతోనే నాగార్జున ఈ కథను రిజెక్ట్ చేశాడు. దాంతో అవకాశం వరుణ్ సందేశ్ కి దక్కగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

భలే భలే మగాడివోయ్:
డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో.. నాని హీరోగా నటించిన చిత్రం భలే భలే మగాడివోయ్.. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఇందులో హీరోగా మొదటి అవకాశం నాగచైతన్యకు ఇచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల నాగచైతన్య ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది.

- Advertisement -

అ ఆ:
త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా.. సమంత హీరోయిన్ గా, అనుపమ పరమేశ్వరన్ తొలి పరిచయంలో వచ్చిన చిత్రం ఇది.. ఇందులో త్రివిక్రమ్ నాగచైతన్యను హీరోగా తీసుకోవాలనుకున్నారు
కానీ త్రివిక్రమ్ ఆఫర్ ను నాగచైతన్య తనకున్న బిజీ కమిట్మెంట్స్ వల్ల తిరస్కరించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

సమ్మోహనం:
నాగచైతన్యను సమ్మోహనం సినిమా కోసం ముందుగా అనుకోగా ఈ సినిమా కూడా ఆయన రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

ఇక వీటితోపాటు వరుడు కావలెను వంటి సినిమాలతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలలో కూడా హీరోగా అవకాశం లభించినా నాగచైతన్య చేయలేకపోయాడు. ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒకవేళ ఈ సినిమాలను ఆయన రిజెక్ట్ చేయకుండా ఉండి ఉంటే.. తప్పకుండా నేడు కమర్షియల్ హీరోగా నైనా చలామణి అయ్యేవారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు