Naga chaitanya : అక్కినేని వారసుడికి యూట్యూబ్ షాక్… పట్టించుకునేవాడే లేడా?

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కింగ్ నాగార్జున ఇండస్ట్రీలో నిలదొక్కకున్నంత వేగంగా ఆయన తనయులు నిలదొక్కుకోలేకపోతున్నారు. నాగ చైతన్యకు మాత్రం ఓ వర్గం ఫ్యాన్ బేస్ ఉంది. ఈయనను మాస్, ప్రయోగాత్మక సినిమాల కన్నా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీస్ లో చూడడానికే తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఊర మాస్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయాడు చైతన్య.

ఇక నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ ఇంకా ఇండస్ట్రీలోనే నిలదొక్కుకోలేదు. ఈ యంగ్ హీరో అక్కినేని వారసత్వాన్ని నిలబెట్టడానికి ఇండస్ట్రీలో ఆపసోపాలు పడుతున్నాడు. అసలు ఆడియన్స్ ఇతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది మేకర్స్ కి కూడా ఇంకా క్లారిటీ రానేలేదు. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్ లోకి నాగచైతన్య ఎంట్రీ ఇవ్వగా, ఆయన ఫాలోవర్స్ ను చూసి అంతా నివ్వెర పోతున్నారు. నిజానికి చాలామంది సెలబ్రిటీలు యూట్యూబ్ చేసిన రెండు రోజుల్లోనే మొదటి వీడియోకి మిలియన్ సబ్స్క్రైబర్స్ మిలియన్ న్యూస్ కొల్లగొట్టారు. కానీ నాగచైతన్య విషయంలో మాత్రం అది కల గాన్ మిగిలిపోయింది.

నాగచైతన్య యూట్యూబ్ ఛానల్ కు ప్రేక్షకుల నుంచి చాలా స్లో రెస్పాన్స్ వస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో నాగచైతన్య మొట్టమొదటిగా నటించిన వెబ్ సిరీస్ “దూత” రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తన వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేయడానికి చైతన్య యూట్యూబ్ లో అడుగు పెట్టాడు. ఎక్స్ లో దాదాపు 2+ మిలియన్ ఫాలోవర్స్, ఇంస్టాగ్రామ్ లో 7+ మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న చైతన్య తాజాగా యూట్యూబ్ స్టార్ట్ చేసి, ఓ వీడియోను కూడా షేర్ చేశాడు.

- Advertisement -

అయితే మూడు రోజుల తర్వాత కూడా ఆ చానల్ కు కేవలం 7K+ సబ్స్క్రైబర్స్ రావడం, కేవలం 50K + వ్యూస్ రావడం ఒక రకంగా అందరికీ షాక్ కు గురి చేసింది. దీనికి కారణం ఏమై ఉంటుందని అక్కినేని ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. నిజానికి నాగచైతన్య షేర్ చేసిన ఫస్ట్ వీడియో పెద్దగా ఆసక్తికరంగా ఏం లేదు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న తన కొత్త వెబ్ సిరీస్ ‘దూత’ గురించి కొన్ని ఇన్పుట్స్ మాత్రం ఇచ్చాడు. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే నాగ చైతన్య యూట్యూబ్ లో ఎక్కువ మందిని ఆకర్షించడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు