Game Changer : శంకర్ పై గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్… అనుకున్నట్టే చేశాడుగా !

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “గేమ్ చేంజర్” అనే మూవీకి సైన్ చేయడం మెగా అభిమానులను థ్రిల్ ఫీలయ్యేలా చేసింది. మరోపక్క శంకర్ తో సినిమా అంటే విఎఫెక్స్, అదీఇదీ అంటూ సినిమాను ఏళ్ల పాటు సాగదీస్తాడు అనే భయం కూడా ఉండేది. అయితే ప్రస్తుతం ఆయన ఈ సినిమా పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసి చరణ్ ఈ సినిమా ఎందుకో ఒప్పుకున్నాడు రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ కూడా శంకర్ తీరుతో విసిగిపోయి, ఈ మూవీ పట్ల అంతగా ఆసక్తి కనబరుస్తున్నట్టుగా కనిపించడం లేదు.

మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టు ఇప్పుడు మెగా ఫాన్స్ కి మరో బ్యాడ్ న్యూస్ అంటూ ఓ వార్త ప్రచారం అవుతుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న”గేమ్ చేంజర్” షూటింగ్ స్టార్ట్ అయి ఏడాది దాటిపోతుంది. అయితే “గేమ్ చేంజర్” షూటింగ్ ప్రారంభమైన తర్వాత డైరెక్టర్ శంకర్… కమల్ హాసన్ తో ప్రెస్టీజియస్ గా చేపట్టిన “ఇండియన్ 2” మూవీ షూటింగ్ ప్రారంభించాల్సి వచ్చింది.

ఏదో ఒక సినిమాను పక్కన పెట్టకుండా శంకర్ ఈ రెండు సినిమాలను చేస్తానంటూ ఒకేసారి రెండు పడవలపై అడుగేసాడు. కానీ రాను రాను “గేమ్ చేంజర్” మూవీని పక్కన పెట్టేసి పూర్తిగా “ఇండియన్ 2″పై దృష్టి పెట్టేసాడు.

- Advertisement -

పైగా ‘హిట్’ మూవీతో హిట్ కొట్టిన కొత్త దర్శకుడు శైలేష్ కొలనును ఇందులో ఇరికించాడు. బజ్ ప్రకారం ‘ఇండియన్ 3’ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది. ‘ఇండియన్ 2’ మూవీని 2024 వేసవికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇక పనిలో పనిగా ‘ఇండియన్ 3’ని కూడా షూట్ చేస్తున్నారట. ఈ మూవీని వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఇక ఈ పరిస్థితి చూస్తుంటే శంకర్ “గేమ్ చేంజర్” మూవీని పూర్తిగా పక్కన పెట్టేసినట్టే. నిజానికి “గేమ్ చేంజర్” మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావలసి ఉంది.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీ 2024 లో కాదు 2025 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాగూ సినిమా ఆలస్యం తప్పదు కాబట్టి రామ్ చరణ్ కూడా “గేమ్ చేంజర్” షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి బుచ్చిబాబుతో నెక్స్ట్ మూవీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇంకేముంది “గేమ్ చేంజర్” రిలీజ్ కోసం మెగా ఫాన్స్ ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఇన్నాళ్లుగా భయపడుతున్నట్టే జరిగింది. ప్రస్తుతం చెర్రీ అభిమానులు శంకర్ పై గుర్రుగా ఉన్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు