Ram Charan: “గేమ్ ఛేంజర్” ను పక్కన పెట్టేసిన శంకర్… భారమంతా అతడి పైనే !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ “గేమ్ ఛేంజర్”. సౌత్ లోనే బడా మూవీస్ కు పెట్టింది పేరు డైరెక్టర్ శంకర్. ఈ క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో రామ్ చరణ్ పడడంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోయారు. అయితే ఇప్పుడు మాత్రం చెర్రీ అసలు డైరెక్టర్ తో మూవీ ఎందుకు ఒప్పుకున్నాడ్రా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు. శంకర్ కూడా తన తీరుతో మెగా ఫ్యాన్స్ తో పాటు చరణ్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతోంది. రోజురోజుకూ ఈ మూవీ షూటింగ్ ఏదో ఒక కారణంతో ఆలస్యం అవుతూ వస్తోంది. అంతేకాకుండా శంకర్ కూడా “గేమ్ ఛేంజర్”ను నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం శంకర్ “గేమ్ ఛేంజర్” మూవీని పూర్తిగా పక్కన పెట్టేశారని తెలుస్తోంది. నిజానికి ఆయన ఒకవైపు కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ మూవీ, మరోవైపు చెర్రీతో “గేమ్ ఛేంజర్” మూవీ ఒకేసారి కమిట్ అయ్యారు. అయితే ఇప్పుడు శంకర్ కంప్లీట్ గా తన దృష్టిని ‘ఇండియన్ 2’పైనే పెట్టారట. “గేమ్ ఛేంజర్” షూటింగ్ బాధ్యతలు వేరే డైరెక్టర్ చేతిలో పెట్టారట. మూవీ షూటింగ్ కోసం కనీసం హైదరాబాద్ కూడా రాకుండా అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారట. సినిమా షూటింగ్ భారం మొత్తాన్ని మరో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుపై పడిందని ఫిల్మ్ వర్గాల సమాచారం.

‘హిట్’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను. ప్రస్తుతం “గేమ్ ఛేంజర్” సినిమా మొత్తానికి ఈయనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టారని తెలుస్తుంది. శంకర్ ఈ సినిమాకు పేరుకే డైరెక్టర్ గా ఉన్నారని, కేవలం వీడియో కాల్స్ ద్వారా సినిమా షూటింగ్ ను పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. దీంతో శంకర్ తీరుపై మెగా ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇప్పుడు దర్శకుడు శైలేష్ కొలను గేమ్ ఛేంజర్ మూవీలో కొంత భాగాన్ని చిత్రీకరించనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇప్పుడు మాత్రం సినిమా షూటింగ్ బాధ్యత మొత్తాన్ని ఆయన చేతుల్లోకి తీసుకుని, త్వరగా పూర్తి చేయాలనీ చూస్తున్నారట. మరి శంకర్ నెగ్లెజెన్స్ కారణంగా సినిమా ఔట్పుట్ ఎలా వస్తుందోనని చెర్రీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న “గేమ్ ఛేంజర్” సినిమా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు