Vijay: విజయ్ మూవీపై సరికొత్త అనుమానాలు.. డైరెక్టర్ మెప్పిస్తారా..?

కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కూడా తన సినిమాలను డబ్ చేసి విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. ఇటీవల లియో సినిమాతో ఒక్కసారిగా కొత్త ట్రెండును కూడా సృష్టించారు హీరో విజయ్. ప్రతి సినిమాకి కూడా సరికొత్త మార్కెట్ ను పెంచుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజినెస్ విషయానికి వస్తే.. రూ .20 కోట్ల వరకు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమాలో విజయ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని #Vijay68 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. విజయ్ ని ఇందులో 19 ఏళ్ల కుర్రాడిగా చూపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో విజయ్ 19 ఏళ్ల కుర్రాడిగా కూడా కనిపించబోతున్నట్లు.. D ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఏకంగా రూ .6కోట్లు ఖర్చుపెట్టి విజయ్ ని 19 సంవత్సరాల వయసున్న యంగ్ కుర్రాడిలా చూపించబోతున్నారు అంటూ గత రెండు మూడు రోజులుగా వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత కొంతమంది అభిమానులు విజయ్ ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటారని పూర్తి నమ్మకంతో ఉన్నారు..

అయితే మరి కొంతమంది సరికొత్త అనుమానాలను లేవనెత్తుతున్నారు.. ఎంత టెక్నాలజీ ఉపయోగించినా సరే.. డైరెక్టర్ అక్కడ టెక్నాలజీని ఉపయోగించినట్టుగా ప్రేక్షకులకు అనిపించకూడదు. ఇక డైరెక్టర్ చేసే డైరెక్షన్ లోనే విజయ్ సత్తా కనపడుతుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది నిజంగానే ఈ సినిమాతో డైరెక్టర్ ప్రేక్షకులను మెప్పిస్తాడా అన్న కొత్త అనుమానాలను సృష్టిస్తున్నారు. మరి డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్రేక్షకుల అనుమానాలకు సమాధానం సినిమాతో చెబుతారా లేక ముందే క్లారిటీ ఇస్తారా అన్నది చూడాలి. ఇకపోతే ఇలాంటి అనుమానాలు అన్నిటికీ క్లారిటీ దొరకాలి అంటే సినిమా విడుదల అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.

- Advertisement -

ఇకపోతే హీరో విజయ్ యంగ్ లుక్కులో కనిపించేటప్పుడు ఎలాంటి విమర్శలు రాకూడదని భారీ స్థాయిలో ఖర్చు చేసి మరి ఈ సినిమాలో విజయ్ ని చూపించబోతున్నారట డైరక్టర్.. నెక్స్ట్ లెవెల్లో స్క్రిప్ట్ ని ఎంచుకుంటున్న హీరో విజయ్ కెరియర్ పరంగా ఈ సినిమా ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి మరి.. హీరో విజయ్ ని అభిమానించే అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. విజయ్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు