HBD Rajinikanth: రజినీకాంత్ ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?

బస్ కండక్టర్ నుంచి నేడు సౌత్ సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆయన లగ్జరీ లైఫ్, ఇల్లు, కార్లు ఏంటి? వాటి విలువ ఎన్ని కోట్లు? అనే వివరాల్లోకి వెళితే…

దేశాలు, సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అద్భుతమైన నటుడు రజనీకాంత్. ఈ సీనియర్ స్టార్ హీరోకు కేవలం దేశంలోనే కాదు, దేశం దాటి సింగపూర్, జపాన్, మలేషియా వంటి దేశాల్లోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇక రజనీకాంత్ సినిమా లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆయన ఆస్తుల విలువ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఇప్పుడు ఆయన ఆస్తులు ఏంటి? వాటి విలువ ఎంత? అనే విషయాలను ఆయన పుట్టినరోజు సందర్భంగా Filmify రీడర్స్ కోసం ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.

రజనీకాంత్ ఆస్తుల విలువ ఏకంగా 52 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో చూసుకుంటే 430 కోట్లు. గత కొంతకాలంగా రజినీకాంత్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. నిజానికి దశాబ్దాల నుంచి హీరోగా ఉన్న రజనీకాంత్ ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ ఆయన ఆస్తులు ఇంకా వందల కోట్ల లోనే ఉన్నాయి. దానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. రజనీకాంత్ సినిమా ఆడకపోతే తను రెమ్యూనరేషన్ గా తీసుకున్న డబ్బులను వెనక్కి ఇచ్చేస్తారట. అలాగే రజినీ సేవ కార్యక్రమాలకు కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తాడు. అందుకే ఆయన ఆస్తులు అందరి నటుల్లా.. వేల కోట్లు కాకుండా వందల కోట్ల వద్దే ఆగిపోయింది.

- Advertisement -

ఇక ఆయనకు చెన్నై లోని పాష్ ఏరియా పోయెస్ గార్డెన్ లో ఒక లగ్జరీ బంగ్లా ఉంది. 2002లో రజనీకాంత్ ఆ ఇంటిని నిర్మించుకోగా, దాని విలువ 35 కోట్లు. అలాగే రజినీకాంత్ కు చెన్నైలో రాఘవేంద్ర మండపం అనే కళ్యాణ మండపం కూడా ఉంది. దీని ఖరీదు 20 కోట్లు అని సమాచారం.

కేవలం ఇవి మాత్రమే కాకుండా రజినీకాంత్ దగ్గర సెలబ్రిటీలు అందరు దగ్గర ఉండే పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో రెండు రోల్స్ రాయిస్ కార్లు కాగా, ఒక రోల్స్ రాయిస్ 6 కోట్లు, రోల్స్ రాయిస్ ఫాంటమ్ 16.5 కోట్లు. ఇక మరో లగ్జరీ కార్ లంబోర్గిని ఉరస్ విలువ 3.10 కోట్లు, రెండు పాయింట్ 55 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్, ఒకటి పాయింట్ 77 కోట్ల విలువ కలిగిన బీఎండబ్ల్యూ ఎక్సె5 కార్లు కూడా రజనీకాంత్ దగ్గర ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా రజినీకాంత్ గ్యారేజీలో ప్రీమియర్ పద్మిని, హోండా సివిక్, ఇన్నోవా టయోటా వంటి కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇలా కండక్టర్ నుంచి కోటీశ్వరుడు అయ్యారు రజనీకాంత్. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కు Filmify నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు