Sandeep Reddy Vanga : ‘ యానిమల్’ డైరెక్టర్ జాక్ పాట్… ఒక్క మూవీతో ఇన్ని కోట్లు సంపాదించాడా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న యానిమల్ మూవీతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పటిదాకా ఎంత సంపాదించాడు? టాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ యంగ్ డైరెక్టర్ ఈ ఒక్క మూవీతోనే జాక్ పాట్ కొట్టాడా? యానిమల్ మూవీతో సందీప్ ఖాతాలోకి ఎన్ని కోట్లు వచ్చి పడ్డాయి? అనే వివరాల్లోకి వెళితే…

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీతో టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఒక్క సినిమాతోనే సినిమా అంటే ఎలా ఉండాలి? బోల్డ్ సన్నివేశాలను ఎలా హ్యాండిల్ చేయాలి? అనే విషయాలను టాప్ డైరెక్టర్ సైతం ఇతని చూసి నేర్చుకునేలా చేశాడు. ఒక వైపు సినిమాపై విమర్శలు వస్తుంటే, అంతకంటే ఎక్కువగా ప్రశంసలు అందుకుంటున్న ఈ డైరెక్టర్ యానిమల్ మూవీతో భారీగా సంపాదించేసాడట. యానిమల్ మూవీని తెరకెక్కించడానికి ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ ను పెట్టేసారట. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ టి సిరీస్, సందీప్ సొంత ప్రొడక్షన్ హౌస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న యానిమల్ మూవీ కేవలం పది రోజుల్లోనే 660 కోట్లు వసూలు చేసి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

యానిమల్ మూవీకి దర్శకత్వం వహించినందుకు గానూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రెమ్యూనరేషన్, సినిమా లాభాలు అన్ని కలుపుకుంటే సందీప్ తో పాటు అతని సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ సినిమా ద్వారా ఏకంగా 200 కోట్ల వరకు వెనకాల వేసుకున్నట్టు సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీతో డైరెక్టర్ సందీప్ కు జాక్ పాట్  తగిలినట్టే. కేవలం ఒక్క మూవీ తోనే వందల కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. సినిమా రిలీజ్ అయి పది రోజులు గడిచిపోతున్నా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద యానిమల్ మూవీ సందడి తగ్గలేదు. దీంతో సందీప్ కి రానున్న రోజుల్లో మరిన్ని లాభాలు వచ్చిపడే అవకాశం ఉంది.

- Advertisement -

ఒకప్పుడు సినిమా కోసం పొలాన్ని అమ్ముకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు దానికి వందల రెట్లు సంపాదించడం విశేషం. అర్జున్ రెడ్డి సినిమా తీయడానికి అప్పట్లో సందీప్ రెడ్డి వంగ 36ఎకరాల మామిడి తోటను అమ్ముకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజానికి ఆ సినిమా టైంలో తన దగ్గర కేవలం ఒకటిన్నర కోట్లు మాత్రమే ఉన్నాయని, మిగతా డబ్బు కోసం పలువురిని సంప్రదించగా, వారు చివరి నిమిషంలో వెనక్కి తగ్గారని, షూటింగ్ కు ఎక్కువ సమయం లేకపోవడంతో మరో 1.6 కోట్ల కోసం తన తండ్రి సోదరుడు కలిసి ఏకంగా 36 ఎకరాల మామిడి తోట అమ్మారని సందీప్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా అప్పుడు తన టాలెంట్ పై ఉన్న నమ్మకంతో ధైర్యం చేసి రిస్క్ తీసుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్నాడు సందీప్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు