Raviteja : మాస్ మహారాజా రెమ్యూనరేషనే ప్రాబ్లమా? మరో మూవీ హోల్డ్ లో?

మాస్ మహారాజా రవితేజ రెమ్యూనరేషన్ తన తాజా సినిమాలకు సమస్యగా మారిందా? ఈ హీరో కారణంగానే తాను నటించాల్సిన కొత్త సినిమాలన్నీ హోల్డ్ లో పడుతున్నాయా? అసలు రవితేజతో నిర్మాతలకు వస్తున్న ప్రాబ్లం ఏంటి? అనే విషయంలోకి వస్తే…

మాస్ మహారాజా రవితేజ ఇప్పటికి ఎనర్జిటిక్ గా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన తన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం చాలా సెలెక్టివ్ గా ఉంటాడు అని టాక్ ఉంది ఫిలింనగర్లో. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కచ్చితంగా తన పారితోషికాన్ని తీసుకుంటాడట. ఇక టాలీవుడ్ లో రవితేజకు ఉన్న మంచి ఫ్యాన్ బేస్ కారణంగా, ఆయనకు ఉన్న కామెడీ టైమింగ్, మాస్ ఫాలోయింగ్ వల్ల రవితేజ సినిమాలు మినిమం హిట్ అవడం గ్యారెంటీ అని నమ్మేవారు నిర్మాతలు. అందుకే ఇప్పటివరకు ఆయన డిమాండ్లను నిర్మాతలు ఒప్పుకుంటూ వచ్చారు. కానీ తాజా పరిస్థితుల కారణంగా రవితేజ డిమాండ్లు నిర్మాతల వద్ద చెల్లడం లేదు.

ఇటీవల కాలంలో రవితేజ వరుస డిజాస్టర్ లను చవి చూస్తున్నాడు. గతంలో క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి. ఇక రీసెంట్ గా ధమాకా మూవీతో హిట్ కొట్టిన రవితేజ ఖాతాలో ఆ తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో ఆయన ఖాతాలో మరో రెండు డిజాస్టర్లు పడిపోయాయి. దీంతో రవితేజ మార్కెట్ స్థిరంగా లేదని, కాబట్టి ఆయన తన రెమ్యూనరేషన్ను తగ్గించుకుంటే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కావడానికి కూడా ఇదే కారణమైంది.

- Advertisement -

తాజాగా రవితేజ కొత్త చిత్రం కూడా ఇలాగే హోల్డ్ లో పడే అవకాశం ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ నిర్మాత దిల్ రాజుతో ఒక మూవీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తో మరో మూవీ చేయాల్సి ఉంది. అనిల్ రావిపూడి, రవితేజ కాంబోలో రాబోతున్న మూవీకి దిల్ రాజు నిర్మాత కాగా, డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ ప్రాజెక్టుకి టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఇద్దరు ప్రొడ్యూసర్లు రవితేజ తన పారితోషికాన్ని తగ్గించుకోమని కోరుతున్నారట. ప్రస్తుతం రవితేజ రెమ్యూనరేషన్ కారణంగానే ఆయనతో సినిమా చేయాలా వద్దా అని సందిగ్ధంలో పడ్డారట నిర్మాతలు. ఇక ఈ ఇద్దరు నిర్మాతల రిక్వెస్ట్ లకు అనుగుణంగా రవితేజ తీసుకునే నిర్ణయం పైనే ఆయన నెక్స్ట్ రెండు సినిమాలు ఆధారపడి ఉన్నాయి. నిర్మతల కోరిక మేరకు రవితేజ పారితోషికాన్ని తగ్గించుకుంటే వచ్చే నెలలో ఈ ప్రాజెక్టులు అధికారికంగా పట్టాలెక్కే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు