HBD Rajinikanth: రజినీకాంత్ గురించి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే..!!

హీరో రజనీకాంత్ అంటే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన నటుడుగా మంచి పాపులారిటీ సంపాదించారు.. రజనీకాంత్ సినిమాలు ఎన్నో భాషలలో విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ తో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సృష్టించుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నప్పటికీ.. చాలా సింపుల్ గానే కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం రజనీకాంత్ 73వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. దీంతో అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రజనీకాంత్ మొదటిసారిగా 1975లో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టారు.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ అలరిస్తూనే ఉన్నారు.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఏకైక నటుడుగా పేరు సంపాదించారు రజనీకాంత్. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సినీ కెరియర్ ను మొదలుపెట్టి ఇండియన్ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించడం జరిగింది.. రజనీకాంత్ కెరియర్ లో ఎన్నో అవార్డులను, రివార్డులను సైతం అందుకున్నారు. అలాంటి రజనీకాంత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రజనీకాంత్ అసలు పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. సినిమాలోకి వచ్చిన తర్వాత రజనీకాంత్ గా మార్చుకున్నారు.

- Advertisement -

రజనీకాంత్ కు చిన్న వయసు నుంచి కన్నడ, మరాఠీ వంటివి మాట్లాడడం వచ్చు. కానీ తమిళ ఇండస్ట్రీలోకి యాక్టింగ్ నేర్చుకోవడానికి అడుగుపెట్టినప్పుడు నుంచి తమిళం నేర్చుకున్నారట.

తన 50 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటివరకు 170 కి పైగా సినిమాలలో నటించారు.

రజినీకాంత్ ఇండస్ట్రీ లోకి రాకముందు మొదట కూలి పనులకు వెళ్లేవారట. ఆ తర్వాత బస్ కండక్టర్ గా కూడా పనిచేశారు.. అలా చాలామంది అమ్మాయిలు సైతం రజనీకాంత్ కోసమే బస్సు ఎక్కే వారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

రజనీకాంత్ మొదటిసారి విలన్ పాత్రలలో నటించడం జరిగింది. ఆ తర్వాతే హీరోగా మంచి పాపులారిటీ అందుకున్నారు.

ఏ హీరోకి దక్కని CBSE సిలబస్ లో కనిపించిన ఏకైక ఇండియన్ నటుడుగా రజనీకాంత్ పైన ఒక పాఠాన్ని పొందుపరిచారు..”FROM BUS CONDUCTOR TO SUPER STAR”

 

తన చిత్రాలతో ఎన్నో టెక్నాలజీలని తెరకెక్కించిన ఘనత అందుకున్నారు రజినీకాంత్.

రజనీకాంత్ ఇప్పటివరకు నటించిన చిత్రాల IMDB లో రోబో సినిమా కి ప్రత్యేకమైన స్థానం దక్కడం గమనార్హం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు