Guntur Kaaram Song: “ఓ మై బేబీ ” సాంగ్ ను ఎక్కడ షూట్ చేశారో తెలుసా?

మోస్ట్ అవైటెడ్ మాస్ మూవీ “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. తాజాగా ఈ మూవీ నుంచి “ఓ మై బేబీ” సాంగ్ ప్రోమో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా? ఈ ఇంట్రెస్టింగ్ విషయం ఎక్స్ క్లూజివ్ గా ఫిల్మీ ఫై రీడర్స్ కోసం…

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” కావడంతో ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. మహేష్ ను మరోసారి మాస్ గెటప్ లో చూడబోతున్నాము అని ఆసక్తి సినిమాపై అంచనాలను పీక్స్ లోకి తీసుకెళ్లింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్లు, సాంగ్స్ హైప్ గ్రాఫ్ ని మరింతగా పెంచేశాయి. ఇక ఎప్పుడెప్పుడా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న “గుంటూరు కారం” మూవీ సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటినుంచే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అందులో భాగంగానే “గుంటూరు కారం” మూవీ రెండో సాంగ్ ప్రోమో డిసెంబర్ 11న రిలీజ్ చేశారు.

“ఓ మై బేబీ” అంటూ మెలోడియస్ గా సాగిన ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వినసొంపైన ట్యూన్ ఇచ్చాడు. ఇక ఈ చిన్న ప్రోమో మహేష్, హీరోయిన్ శ్రీలీల మధ్య రాబోయే రొమాంటిక్ డ్యూయెట్ పై ఆసక్తిని పెంచేసింది. “ఓ మై బేబీ” పాటను శిల్పారావు పాడగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. సాంగ్ ప్రోమో తోనే ఈ వివరాలన్నీ మనకు తెలిసిపోయాయి. కానీ ఈ సాంగ్ షూటింగ్ ఎక్కడ జరిగింది ? అనే విషయం మాత్రం ఎవరికీ తెలీదు. మరి “ఓ మై బేబీ” సాంగ్ షూటింగ్ ఎక్కడ జరిగింది ? అంటే… గచ్చిబౌలి అట్రియమ్ మాల్ లో కొంత షూట్ చేయగా, హైదరాబాదులో ఉన్న ఓ పబ్ లో, మరో టౌన్ షిప్ లో ఇలా చాలా చోట్ల ఈ పాటను చిత్రీకరించారు.

- Advertisement -

ఇదిలా ఉంటే… నిమిషం కూడా లేని ప్రోమో రిలీజ్ చేసి “గుంటూరు కారం” మేకర్స్ ప్రేక్షకులను నిరాశపరచాలని చెప్పాలి. కానీ ఆ సెకండ్స్ ప్రోమోలో మహేష్ బాబు చెప్పిన ” అమ్ము… రమణ గాడు… గుర్తుపెట్టుకో… గుంటూరు వస్తే పనికొస్తది” అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ప్రోమోలో కేవలం శ్రీలీలను మాత్రమే చూపించారు. డిసెంబర్ 13న ఈ సాంగ్ పూర్తిగా రిలీజ్ కానుంది. అప్పుడు మహేష్ బాబు లుక్ బయటకు వచ్చే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు