Allu Arjun: మృణాల్ పై మనసు పడ్డ ఐకాన్ స్టార్… హీరోయిన్ ఫేట్ మార్చేస్తాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎంతో మంది హీరోయిన్లు తహతహలాడుతుంటారు. కానీ తాజాగా అల్లు అర్జున్ ఓ హీరోయిన్ పై మనసు పారేసుకున్నారు. ఆమె ఎవరో కాదు మృణాల్ ఠాకూర్. ఈ భామపై తాజాగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి త్వరలోనే బన్నీ ఆమె ఫేట్ ను మార్చేయబోతున్నాడా?

గత వారం నాని హీరోగా నటించిన “హాయ్ నాన్న” మూవీ రిలీజ్ అయ్యి, ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ రాబట్టుకుంటుంది. సినిమాపై ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. రెగ్యులర్ మాస్, కమర్షియల్ మూవీ కాకపోవడంతో, బీసీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. అయినప్పటికీ హాయ్ నాన్న మూవీ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేస్తోంది.

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ “హాయ్ నాన్న” టీం పై ప్రశంసల వర్షం కురిపించాడు. “హాయ్ నాన్న టీంకు కంగ్రాట్స్ మూవీ ఎంతో అద్భుతంగా ఉంది. ఇది ఒక స్వీట్ మూవీ. మనసుకు హత్తుకునేలా ఉంది. నాని పర్ఫామెన్స్ చాలా సహజంగా అనిపిస్తుంది. ఇలాంటి స్క్రిప్ట్ ను వెలుగులోకి తీసుకొచ్చినందుకు నాని పట్ల నాకు గర్వంగా ఉంది. బేబీ కియారా నువ్వు నా డార్లింగ్ అయిపోయావు. నీ క్యూట్ నెస్ తో అందరి మనసులను దోచేస్తున్నావ్ అంటూ హాయ్ నాన్న టీంపై ప్రశంసల వర్షం కురిపించాడు.

- Advertisement -

అయితే మృణాల్ పై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు స్పెషల్ గా మారాయి. “డియర్ మృణాల్ నీ స్వీట్ నెస్ స్క్రీన్ మొత్తం నిండిపోయింది. స్క్రీన్ పై నువ్వు అందరినీ వెంటాడుతూనే ఉన్నావ్. సినిమా కూడా నీలాగే అందంగా ఉంది” అంటూ హీరోయిన్ పై బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇదంతా చూసి మృణాల్ పై బన్నీ మనసు పారేసుకున్నాడని, తన నెక్స్ట్ మూవీలో ఈ అమ్మడికి ఛాన్స్ ఇవ్వడం ఖాయమని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

ఒకవేళ అదే గనక నిజమైతే ఈ అమ్మడి ఫేట్ మారినట్టే. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా అల్లు అర్జున్ తో నటించిన చాలామంది హీరోయిన్లు ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అలాంటప్పుడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్ మృణాల్ కు అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వస్తే అంతకంటే ఇంకేం కావాలి? నిజానికి ఆమెకు అదొక గోల్డెన్ ఛాన్స్ అవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత ఈ బ్యూటీ కూడా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోతుంది.

మరి అల్లు అర్జున్ ప్రశంసలు సోషల్ మీడియాకే పరిమితం అవుతాయా? లేదంటే తన నెక్స్ట్ మూవీలో ఈ భామకు ఛాన్స్ ఇస్తాడా అనేది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు