Keerthy Suresh: సిస్టర్ కోసం చేస్తున్న పోరాటం… ఫలిస్తుందా?

మహానటి కీర్తి సురేష్… మహానటి సినిమా వచ్చి ఐదేళ్లు గడుస్తుంది. అయినా, కీర్తిని ఇంకా మహానటి కీర్తి సురేష్ అనే పిలుస్తున్నారు. దీని తర్వాత కీర్తి సురేష్ చాలా సినిమాలు చేసింది. అందులో ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి. కానీ, ఏవీ కూడా మహానటి తీసుకువచ్చిన గుర్తింపును బీట్ చేయలేకపోయాయి. అయినా, కీర్తి ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా, ఇటు సిల్వర్ స్క్రిన్.. అటు ఓటీటీ స్క్రిన్ పై కనిపించడానికి కష్టపడుతూనే ఉంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో రాధిక ఆప్టే కూడా కీ రోల్ చేస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఇప్పటికే వచ్చింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ వెబ్ సిరీస్ కోసం.. కీర్తి ముంబై ఫ్లైట్ ఎక్కిందట. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ రెగ్యూలర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుందని తెలుస్తుంది.

అలాగే ఈ వెబ్ సిరీస్ కీర్తి నుంచి గతంలో వచ్చిన వెబ్ సిరీస్ లకు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే కీర్తి కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేయాల్సి ఉంటుందట. అందుకు ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందని సమాచారం. ముఖ్యంగా రాధిక ఆప్టే – కీర్తి సురేష్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు ఇతర సీన్స్ కూడా ఆట్రాక్టివ్ గా ఉంటాయని, అవే వెబ్ సిరీస్ కు హైలైట్ అవుతాయని టాక్ వస్తుంది.

- Advertisement -

ఈ వెబ్ సిరీస్ తర్వాత కీర్తి సురేష్ ఓటీటీ కెరీర్ మొత్తం మారిపోయే అవకాశం ఉందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి.. షూటింగ్ స్టార్ట్ కాక ముందే ఇంత హైప్ ఉన్న ఈ వెబ్ సిరీస్ విడుదల తర్వాత ఎంత మందిని ఇంప్రెస్ చేస్తుందో…

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు