Pragathi: వామ్మో.. నటి ప్రగతి కూతుర్ని చూసారా.. ఫిదా అవ్వాల్సిందే !

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటిగా పేరుపొందింది నటి ప్రగతి.. హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాలలో నటించిన ఈమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాల పైనే కావస్తోంది. ఈ మధ్యకాలంలో ఏదో ఒక విషయంలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది ప్రగతి.. ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేటువంటి ఫోటోలను, వీడియోలను చూసి అభిమానులు ముక్కున వేలు వేసుకునేలా చేస్తూ ఉంటుంది. ఇటీవల జాతీయస్థాయిలో కూడా తన సత్తా చాటి మరింత క్రేజ్ అందుకుంది.. ప్రగతి ఫిట్నెస్ మైంటైన్ చేయడంలో ఇతర నటీనటుల కంటే కాస్త భిన్నంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇటీవల బెంగళూరులో జరిగిన 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఛాంపియన్షిప్ గా గెలిచింది. ఈ పోటీలో ఏకంగా ఈమె మూడో స్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు తన ఆశయం కోసం పోరాడుతున్నటువంటి ప్రగతిని చూసి పలువురు అభిమానులు, నెటిజన్స్ సైతం ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రగతికి వివాహమైన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల చేత చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ప్రగతి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. కొన్ని కారణాల చేత తన భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

- Advertisement -

Actress Pragathi's daughter.. Heroine material

ప్రగతి ఎప్పుడు కూడా తన పిల్లల ఫోటోలను చాలా అరుదుగా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రగతి తన కూతురి ఫోటోను షేర్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రగతి కూతురు పేరు గీత. తల్లికి తగ్గట్టుగా అందంగానే కనిపిస్తూ ఉన్నది తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హీరోయిన్ మెటీరియల్ తో ప్రగతి కూతురు ఉందంటూ పలువురు నెటిజెన్స్ తెలుపుతున్నారు. అంతేకాదు ఆమె అందానికి సినీ లోకం ఫిదా అవుతుందని చెప్పవచ్చు.

Actress Pragathi's daughter.. Heroine material

మరి రాబోయే రోజుల్లో ప్రగతి కూతురుని సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తుందేమో చూడాలి మరి. తన కొడుకు, కూతుర్ని సైతం తానే చదివిస్తున్నానని కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది ప్రగతి. ప్రస్తుతం ప్రగతి కూతురికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు