UBS: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ గత కొన్ని నెలల క్రితమే హుటా హుటిన మొదలై, ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ లో తరుచుగా పాల్గొనుండటం వల్ల ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారంగా చూస్తే.. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మొదలవబోతుందని సమాచారం అందుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ విషయమై ఇటీవలనే మైత్రి ప్రొడ్యూసర్స్ డేట్స్ విషయమై పవన్ కళ్యాణ్ ను కలవడంతో.. ఆయన ఈ నెల 20 నుంచి డేట్స్ ఇష్యూ చేసినట్టు తెలుస్తుంది.

దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ను ఈ నెల 20 నుంచి తిరిగి స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. మరి ఈసారైనా పవన్ కళ్యాణ్ ఏ ట్విస్ట్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటాడో లేక మళ్ళీ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తాడో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు