National Cinema Day Special: తెలుగు ఇండస్ట్రీ… అవమానాల నుంచి ఆస్కార్ వరకు

“గోవా, న్యూ ఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లలోకి ఫంక్షన్స్ కి వెళ్లినప్పుడు తెలుగు వాళ్లకి గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్లిన నాకు.. మహానటుడు రామారావు గారి బొమ్మ లేదక్కడ. అక్కినేని నాగేశ్వరరావు గారి బొమ్మ లేదు. మా మాట సరేసరి. ఇది మన గుర్తింపు. మనం బాంబే, ఢిల్లీ, గోవా వరకు కూడా వెళ్లలేకపోయాం” ఈ డైలాగ్స్ ఎక్కడో విన్నట్టు ఉంది. కదా.. కొంత మంది అయితే ఈ మాటలను అంతా ఈజీగా మర్చిపోరు.

2007 జనవరిలో జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ఎమోషనల్ డైలాగ్స్ ఇవి. ఎప్పుడు అందరిని ఎంటర్‌టైన్ చేసే మెగాస్టార్ ఫస్ట్ టైం ఎమోషన్‌గా ఈ డైలాగ్ చెప్పడం చాలా మందిని కదిలించింది. నిజానికి ఆ సమయంలో తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి అదే. అప్పుడు భారతీయ సినిమాలు అంటే బాలీవుడ్ సినిమాలే అని తెలుసు. ఇతర ఇండస్ట్రీలకు వాల్యూ ఉండేది కాదు. ఇక తెలుగు ఇండస్ట్రీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతి మంచిదేమో.

అలాంటి అవమానాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి నేడు తెలుగు చిత్ర సీమ ఆస్కార్ అవార్డ్ వరకు వెళ్లింది. దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చెక్కిన బాహుబలి, బాహుబలి2 తో పాటు పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటాయి. ఆర్ఆర్ఆర్ మూవీ అయితే ఏకంగా ఆస్కార్ అవార్డును తీసుకొచ్చి టాలీవుడ్ ఒడిలో పెట్టింది. భారతీయ సినిమాలు అంటే బాలీవుడ్ సినిమాలు అనుకునే స్థాయి నుంచి భారతీయ సినిమాలు అంటే తెలుగు సినిమాలు అనే స్థాయికి టాలీవుడ్ ఎదిగింది.

- Advertisement -

ఈ సినిమాలను ఇన్స్పరేషన్ తీసుకుని ప్రస్తుతం వరల్డ్ క్లాస్ సినిమాలు తెలుగు నుంచి కోకోల్లలుగా వస్తున్నాయి. ఇంకా మరెన్నో ఇంటర్నేషనల్ అవార్డులు తెలుగు సినిమా ఇండస్ట్రీ గడప తొక్కడానికి రెడీగా ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం ఉన్న స్థాయికి రావడానికి ఆనాటి తరం ఎన్టీ రామరావు నుంచి నేటి తరం రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ వరకు అందరీ పాత్ర ఉంది.

నేడు టాలీవుడ్ ఒక ఆస్కార్ అవార్డుతో National Cinema Day జరుపుకుంటుంది. రాబోయే National Cinema Day మరిన్ని ఆస్కార్ అవార్డులతో గ్రాండ్‌గా జరపుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు