Trisha : ఏజ్ పెరిగినా.. తగ్గని డిమాండ్

అఖండ భారీ విజయం తర్వాత బాలయ్య మళ్లీ అలాంటి పెద్ద చిత్రాలే చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం గోపిచంద్ మలినేని తో NBK 107 చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. సంక్రాంతికి విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ దీపావళికి టైటిల్ తో పాటు గ్లింప్స్ ను విడుదల చేసే అవకాశం ఉంది. NBK 107 సెట్స్ పై ఉన్నప్పుడే మరో సినిమాను లైన్ లోకి తీసుకువస్తున్నాడు బాలయ్య.

ఎఫ్ 3 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి, తన తర్వాతి సినిమా బాలయ్యతో చేస్తున్న సంగతి తెలిసిందే. NBK 108 వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం గురించి గత రెండు రోజులుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా త్రిష ను చిత్ర యూనిట్ ఎంపిక చేసిందని సమాచారం అందుతుంది. త్రిష పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందట.

అంతే కాకుండా ఈ చిత్రానికి గాను త్రిష 1 కోటి రూపాయల రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ – 1 నటించి అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందింది. ఇప్పుడు NBK 108 లో ఛాన్స్ దక్కించుకుని ఔరా అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు