Allu Sireesh: ఆ బాధ ఉంటుంది

కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఊర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు, అలానే సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది.

ఈ చిత్రం నవంబర్ 4న విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో ఈ చిత్రం ప్రొమోషన్స్ లో స్పీడ్ ను పెంచింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అల్లు శిరీష్ “ఊర్వశివో రాక్షసివో” చిత్ర విశేషాలను పంచుకుంటూ ఒక వ్యక్తిగత విషయంపై కూడా స్పందించారు.

లవ్ లో బ్రేకప్ అబ్బాయి చెప్పిన కూడా, అబ్బాయికి ఆ బాధ అనేది ఉంటుంది అని చెబుతూ తన జీవితంలో జరిగిన బ్రేకప్ గురించి ప్రస్తావిస్తూతనే ఒక పెద్దింటి అమ్మాయికి బ్రేకప్ చెప్పానని, ఆ రోజుకి అది కరక్ట్ డెసిషన్ అని ఫీల్ అయ్యాను అని, తరవాత బాధ పడ్డాను అని చెప్పుకొచ్చారు శిరీష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు