Political backdrop Movies : విభిన్న కోణాల్లో రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలు

చాలామంది దర్శకులు చాలా జోనర్ లలో సినిమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది లవ్ స్టోరీలు బాగా తెరకెక్కిస్తారు. ఇంకొంతమంది యాక్షన్ ఫిలిమ్స్ బాగా తెరకెక్కిస్తారు. కొంతమంది ఫ్యామిలీ ఎమోషన్స్ ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తారు. వీటన్నిటితోపాటు పొలిటికల్ డ్రామాలను కొంతమంది డైరెక్టర్లు బాగా డీల్ చేస్తారు. వీరిలో ఈ కోణం కూడా ఉంది అనే రేంజ్ లో ఆ సినిమాలను తెరకెక్కిస్తారు.

ఒకే ఒక్కడు
దర్శకుడు శంకర్, ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పేరును సాధించిన దర్శకుడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకే ఒక్కడు సినిమా అనేది ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఒక్కరోజులో సీఎం ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ని చూపించింది ఆ సినిమా.

ప్రస్థానం
ప్రస్థానం ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు దేవకట్ట. సినిమాని ఇలా కూడా తీయొచ్చు. ఒక పొలిటికల్ డ్రామాని ఇలా కూడా చూపించవచ్చని చాలా ఇంటెన్షన్ తో తీసిన సినిమా ప్రస్థానం. ముఖ్యంగా ప్రస్థానం సినిమా గుర్తుకు వస్తే సాయికుమార్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం అంత బాగుంటుంది. ఈ సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ సినిమాలోని డైలాగ్స్. “అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో” అంటూ సాయికుమార్ చెప్పిన డైలాగ్స్ ఎంత ఫేమస్ అయ్యాయో మనందరికీ తెలియంది కాదు.

- Advertisement -

ముకుంద
కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమాతో మంచి హిట్ అందుకొని తన రెండవ సినిమానే మల్టీ స్టారర్ చేసి దానితో కూడా అద్భుతమైన హిట్ అందుకున్నాడు. అయితే మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ను పరిచయం చేస్తూ, ముకుందా అనే ఒక పొలిటికల్ డ్రామా ని తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాలోని డైలాగ్స్, వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్సెస్ ఎప్పటికీ మర్చిపోలేము. అంత అద్భుతంగా ఒక పొలిటికల్ డ్రామాను తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల.

లీడర్
శేఖర్ కమ్ముల, ఫీల్ గుడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్. శేఖర్ కమ్ముల డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన కూడా శేఖర్ కమ్ములని డైరెక్టర్ గా నిలబెట్టింది మాత్రం ఆనంద్. ఆనంద్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల గోదావరి,హ్యాపీడేస్ అనే సినిమాలు చేశాడు. ఫస్ట్ టైం ఒక పొలిటికల్ డ్రామాను తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల అదే లీడర్. ఒక పొలిటికల్ డ్రామాని ఇలా కూడా తీయొచ్చు అంటూ సీఎం రోల్ లో రానాను చూపించి అందర్నీ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అవినీతి అభివృద్ధి అంటరానితనం వంటి కాన్సెప్ట్స్ ను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు.

రంగస్థలం
రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడని బయటికి తీసిన సినిమా రంగస్థలం. కేవలం రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటకు తీయడమే కాకుండా, సుకుమార్ లో ఈ తరహా దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించిన సినిమా. ఒక ఊరిని 30 ఏళ్లుగా రూల్ చేస్తున్న ఒక ప్రెసిడెంట్ ని ఒక సామాన్యలు ఎలా ఎదుర్కొన్నారు అనే ఈ కాన్సెప్ట్ అద్భుతమైన హిట్ అయింది. ఈ సినిమాలోని పర్ఫామెన్స్ డైలాగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు