Election Promotion movies : నేటి రాజకీయ ప్రచార చిత్రాలు

ఒక బయోపిక్ తీసినప్పుడు, ఒక నిజ జీవిత సంఘటనను సినిమాగా తెరకెక్కించినప్పుడు దానిలో వాస్తవాలను చూపించేది చాలా తక్కువగా జరుగుతుంది. రీసెంట్ టైమ్స్ లో కొన్ని బయోపిక్స్ గాని నిజ జీవిత సంఘటనలు గాని తీసినప్పుడు అవన్నీ కూడా ఒక వర్గానికో లేదంటే ఒకవైపుకు సంబంధించినవి ఉండటం కామన్ విషయం. అలా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కొన్ని సినిమాలు ఏంటో చూద్దాం.

యాత్ర
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో భాగంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని యాత్ర అనే సినిమాను తీశారు దర్శకుడు మహి వి రాఘవ్. అయితే ఈ సినిమాలో కేవలం వైయస్సార్ యొక్క పాదయాత్రలోని జరిగిన ముఖ్యమైన సంఘటనలని, ఆ సంఘటనల ద్వారా ఆయన తీసుకొచ్చిన పథకాలని చూపించారు. వేరే పార్టీలను వేరే వ్యక్తులను కించపరచకుండా కేవలం రాజశేఖర్ రెడ్డి ఎంత గొప్పవాడు అంటూ చూపించడం మాత్రమే ఈ సినిమా యొక్క ఉద్దేశం.

కథనాయకుడు
స్వర్గీయ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్రను వేసి తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయారు. ఈయన జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమాలు కథానాయకుడు, మహానాయకుడు. అయితే కొన్ని బయోపిక్ సినిమాలు వర్కౌట్ అయినంతగా ఈ రెండు సినిమాలు వర్కౌట్ కాలేదు. దీనికి కేవలం కొన్ని ఎలివేషన్స్ సీన్స్ పెట్టడమే కారణమని చెప్పొచ్చు.

- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్
రాంగోపాల్ వర్మ, ఇది కేవలం పేరు కాదు వివాదాలకి మారుపేరు. ఆర్జీవి ఏ సినిమా చేసినా కూడా ముందు కాంట్రవర్సీలు వినిపిస్తుంటాయి. అయితే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి.? లక్ష్మీపార్వతిని ఏ విధంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ మోసం చేశారు.? ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడం వల్ల లక్ష్మీపార్వతి నష్టపోయింది ఏంటి.? అంటూ ఒక వర్గాన్ని కించపరుస్తూ చేసిన సినిమా ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్.

రాజధాని ఫైల్స్
రీసెంట్ టైమ్స్ లో వచ్చి ఎక్కువ వివాదాలకు దారి తీసిన సినిమా రాజధాని ఫైల్స్. ఈ సినిమా రిలీజ్ అయిన రోజే చాలామంది అడ్డుకున్నారు. అమరావతి ప్రాంతంలోని జరిగిన కొన్ని పరిణామాలను ఆధారంగా తీసుకొని, ఒక నాయకున్ని కించపరుస్తూ చేసిన సినిమా ఈ రాజధాని ఫైల్స్. ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడకుండా ఒక వర్గపు ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లో మొదటి రోజే ఆపారు.

వ్యూహం
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా వ్యూహం. 2009 ఎలక్షన్స్ నుంచి ఇప్పటివరకు జరుగుతున్న ఎలక్షన్ పరిణామాలు దృశ్య రాంగోపాల్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఈ సినిమా రిలీజ్ కాకపోవడానికి కారణం ఒక రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలోని కీలక వ్యక్తులు అని చెప్పొచ్చు. ఈ సినిమా ఇప్పటివరకే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది ఇప్పటికి ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అవుతుందని నమ్మకం కూడా లేదు. ఒకవేళ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వకపోయినా కూడా యూట్యూబ్లో రిలీజ్ చేసేంత సామర్థ్యం ఉన్న వ్యక్తి రాంగోపాల్ వర్మ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు