Tollywood : పొరుగింటి పుల్లకూరే రుచి… తమిళ స్టార్ కు తెలుగు బడా ప్రొడక్షన్ హౌజ్ బంపర్ ఆఫర్ !

పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెతను తరచుగా వింటూనే ఉంటాం. అయితే తాజాగా టాలీవుడ్ లోని ఓ బడా నిర్మాణ సంస్థకు ఇది వర్తిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి సదరు బడా ప్రొడక్షన్ హౌస్ పై నెటిజన్ల అసంతృప్తికి కారణం ఏమిటంటే…

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు ఓ తెలుగు స్టార్ ప్రొడక్షన్ హౌస్ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ఆ నిర్మాణ సంస్థ పరభాష హీరో అయిన అజిత్ కి ఏకంగా 150 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేసిందట. నిజానికి అజిత్ ప్రస్తుతం ఫామ్ లో లేనే లేడు. ఆయన సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఇక అజిత్ చేయబోయే నెక్స్ట్ మూవీకి తెలుగు నిర్మాణ సంస్థ ఇంతటి భారీ పారితోషకం ఆఫర్ చేయడం ఏంటనే విషయం అందరిని ఆశ్చర్యపరిచింది. ‘మార్క్ ఆంటోనీ’తో ఇటీవల హీరో విశాల్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అది రామచంద్రన్ ఈ మూవీనీ డైరెక్ట్ చేయబోతున్నాడని. వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోతున్న క్రేజీ మూవీలో హీరో కోసమే ఈ రేంజ్ లో పారితోషకం ఆఫర్ చేస్తున్నారంటే, మరి మూవీ ఏ లెవెల్ లో ఉంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం బయటకు రావడంతో నేటిజెన్లు ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు.

ఇది టూ మచ్ అని, అసలు అజిత్ కు ఆ రేంజ్ మార్కెట్ లేనేలేదని, ఆయనకి ఇప్పుడున్న మార్కెట్ కి అంత రెమ్యూనరేషనా? అని అంటున్నారు. మరికొంతమంది మనవాళ్లకు అది మామూలే గా పొరుగింటి పుల్లకూర రుచి అంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అజిత్ కనీసం సినిమా ప్రమోషన్స్ లో కూడా పాలు పంచుకోవడం వీళ్లకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా టాలీవుడ్ లో ఉన్న ఇంతమంది హీరోలను వదిలేసి ప్రస్తుతం వాళ్లు తీయబోయే సినిమాకు అంతటి మార్కెట్ లేనే ఓ పరభాష హీరోకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం అనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే తమిళ ప్రేక్షకులు కనీసం తెలుగు సినిమాలను చూడను కూడా చూడరు. పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి ఒకటి రెండు సినిమాలను తప్ప తమిళ తమ్ముళ్లు తెలుగు సినిమాలను పెద్దగా ఆదరించింది లేదు. కానీ మనోళ్ళు మాత్రం తమిళ హీరోలను పట్టుకుని వేలాడుతున్నారు. అలాగే వాళ్ల సినిమాలను టాలీవుడ్ లోనూ రిలీజ్ చేస్తూ వాళ్లకున్న మార్కెట్ ను పెంచడమే కాకుండా ఫ్యాన్ బేస్ పెరగడంలో సహాయపడుతున్నారు. కానీ తెలుగు హీరోల విషయంలో మాత్రం ఇది పూర్తిగా ఆపోజిట్ గా ఉంది. మరి ఈ విషయాన్ని మన ప్రొడ్యూసర్స్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు