Extra Ordinary Man: నితిన్ టీం సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి?

యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుంది. డిసెంబర్ 8న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఎండ్ టు ఎండ్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించింది. పంచులతో ఆ మూవీపై ఆసక్తిని పెంచేసింది. అయితే సినిమా విడుదలకు ఇంకా వారం కూడా లేదు. కానీ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ టీం ప్రమోషన్స్ లో ఇంకా దూకుడు పెంచనేలేదు.

అసలు ఈ మూవీ విషయంలో నితిన్ టీం సైలెంట్ గా ఉండడం వెనుక కారణం ఏంటి అనేది ఆయన అభిమానులకు అంతు చిక్కని విషయంగా మారిపోయింది. ఇప్పటిదాకా ఎలక్షన్స్, ‘యానిమల్’ లాంటి పెద్ద మూవీ రిలీజ్ లు అని కాలం వెళ్లదీసిన ఈ మూవీ మేకర్స్ ఇప్పటికైనా మేలుకొంటే మంచిది. అసలే సినిమాపై బజ్ అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా డైరెక్టర్ వక్కంతం వంశీ ఫస్ట్ మూవీ పరాజయం పాలవ్వడంతో ఈ మూవీపై అంచనాలు అసలే మాత్రం లేవని చెప్పొచ్చు.

అంతేకాకుండా హరీష్ జయరాజ్ సంగీతం అందించిన తెలుగు సినిమాలేవీ హిట్ కావన్న సెంటిమెంట్ కూడా ఉంది. ఈ సినిమాకు కూడా హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండడం నితిన్ ఫాన్స్ ను ఆందోళనకు గురి చేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ శ్రీలీల కూడా ప్రమోషన్స్ లో కనిపించే అవకాశం దాదాపుగా తక్కువేనని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ టీం ప్రమోషన్స్ పరంగా ఇంకా ఉలుకూ పలుకూ లేకుండా ఉంది.

- Advertisement -

హీరో నితిన్ మాత్రమే అడపదడపా ఇంటర్వ్యూలలో కనిపిస్తూ సినిమా గురించిన విషయాలను వెల్లడిస్తున్నాడు. కానీ సినిమాపై హైప్ క్రియేట్ కావాలంటే ఆయన ఒక్కడి వల్ల కాదన్న విషయం జనమెరిగిన సత్యం. అయినప్పటికీ నితిన్ ఒక్కడే సినిమా ప్రమోషన్ బాధ్యతలు అన్నిటిని తన భుజాన వేసుకుని మోస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రీలీల డేట్స్ దొరకడం తమకు చాలెంజింగ్ గా ఉందని నితిన్ వెల్లడించాడు. ఆమె అసలు ప్రమోషన్లకు వస్తుందా రాదా ? అన్న టెన్షన్ కూడా ఉందంటూ అసలు విషయాన్ని బయటకు చెప్పేశాడు. మూవీ ప్రమోషన్స్ కు శ్రీలీల దూరంగా ఉంటే అది ఖచ్చితంగా “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”కు మైనస్ అవుతుందని చెప్పొచ్చు. మరి సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఏం చేస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు