Hi Nanna : విజయ్ దేవరకొండ, రష్మికకు నాని సారీ… ప్రమోషనల్ స్టంట్ అసలు కథ ఇదేనట!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం “హాయ్ నాన్న” రిలీజ్ కు రెడీ అవుతోంది. శౌర్యువ్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ డిసెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్లపై దృష్టి సారించింది. అందులో భాగంగానే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో నాని తన సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక ఫోటోలను వాడుకోవడం గురించి స్పందిస్తూ సారీ చెప్పారు.

“హాయ్ నాన్న” మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అనూహ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక గోవా వెకేషన్ ఫోటోలను స్క్రీన్ పై వేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలను చూపిస్తూ యాంకర్ సుమ వాళ్ల గురించి మీరేమనుకుంటారు అంటూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ప్రశ్నించింది. వెకేషన్ మోడ్ ఆన్ అంటూ అప్పటికి ఏదో ఒక విధంగా కవర్ చేశారు. కానీ సోషల్ మీడియా మాత్రం నానిని వదల్లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతగా దిగజారాలా? అతను సినిమా కోసం మరొక హీరో హీరోయిన్ పర్సనల్ ఫోటోలను ఇలా వాడుకోవడం ఏంటని మండిపడ్డారు.

ఇది చీప్ ప్రమోషనల్ స్టంట్ అని, నాని ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరి కొంతమంది మాత్రం నానికి తెలిసే ఇదంతా జరిగిందంటూ ఫైర్ అయ్యారు. తాజాగా ఈ విషయంపై నాని స్పందిస్తూ అసలేం జరిగిందో వెల్లడించారు. ఆ ప్రమోషనల్ ఈవెంట్ లో చాలామంది ఉంటారని, ఎవరో ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అలా చేశారని, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపే అదంతా జరిగిపోయిందని అన్నాడు.

- Advertisement -

నాని మాట్లాడుతూ “ఆ సంఘటన దురదృష్టకరం. ఇది కొంతమంది సిబ్బంది పొరపాటు. అయితే ఈ వివాదం తర్వాత తమ ఉద్యోగాలు పోతాయని వారు అప్పటికే భయపడి ఉండవచ్చు. కాబట్టి మేము సీన్ చేయాలనుకోలేదు. అందుకే ఈ విషయాన్ని పెద్దది చేయలేదు” అని చెప్పారు.

సోషల్ మీడియాలో ఇది పబ్లిసిటీ స్టంట్ అని వస్తున్న కామెంట్స్ గురించి మాట్లాడుతూ “ఇది నిజంగా నిజాయితీగల తప్పు. వాళ్ళు నా స్నేహితులే కాబట్టి అసలేం జరిగిందో అర్థం చేసుకుంటారు. అందుకే నేను వారిని ఈ విషయం గురించి కలవలేదు. కానీ వారు బాధపడినట్లయితే మేము నిజంగా టీం తరపున క్షమాపణలు చెబుతాము” అన్నారాయన. అదంతా తనకు తెలియకుండానే జరిగిపోయిందని వివరణ ఇచ్చాడు. అయితే ఈ విషయంపై రష్మిక గాని, విజయ్ దేవరకొండ గాని ఇప్పటిదాకా అసలు రియాక్ట్ అవ్వనే లేదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు