Mohini: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తోందంటే..?

బాలకృష్ణ సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ టైం ట్రావెల్ మూవీ గా నిలిచిపోయిన ఆదిత్య 369 మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పటికీ బుల్లితెర ఛానల్స్ లో ప్రసారమైతే టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. అంతలా ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మోహిని క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈమె అసలు పేరు మహాలక్ష్మి శ్రీనివాసన్.. హీరోయిన్గా అరంగేట్రం చేసిన ఈమె తన పేరును మోహిని శ్రీనివాసన్ గా మార్చుకున్నారు.

చాలా తక్కువ సినిమాల్లోనే నటించినా.. మంచి గుర్తింపు మాత్రం సంపాదించిందని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం భాషల్లో నటించిన మోహిని చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరియర్ ను మొదలుపెట్టి 1991లో ఈరమన రోజావే అనే చిత్రం ద్వారా తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది. అంతేకాదు ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో హిందీలో అభి అభి అనే పేరుతో రీమేక్ చేయడం జరిగింది. ఇక అందులో కూడా ఈమె హీరోయిన్గా నటించారు.

అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలా మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో మోహిని మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలోనే పలు ఆఫర్లు రావడంతో తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. అప్పుడే తెలుగులో స్టార్ హీరో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా లో అవకాశం రావడంతో.. ఈ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత హిట్లర్, డిటెక్టివ్ నారద, మామ బాగున్నావ్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈమె తన అందం, అభినయంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.

- Advertisement -

అంతేకాదు అబ్బాయిల డ్రీమ్ గర్ల్ గా మారిన మోహినికి అప్పట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే భరత్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న ఈమె గుర్తుపట్టలేనంతగా మారిపోయి పూర్తిగా బరువు పెరిగిపోయారు. ప్రస్తుతం కుటుంబం, భర్త, పిల్లలు అంటూ వైవాహిక జీవితానికే పరిమితమైన మోహిని ఇలా అధిక బరువుతో కనిపించడం తో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా మోహిని ని ఇలా ఒక్కసారిగా చూసి అందరూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు