Telugu singer : ఆ అలవాటే కోట్లు నష్టపోయేలా చేసింది – గీతా మాధురి..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్స్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో అగ్రస్థానంలో దూసుకుపోతూ తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న గీతామాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ హీరో నందుని వివాహం చేసుకున్న తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ఒకే ట్రెండ్ లోనే కాకుండా వాయిస్ మాడ్యులేషన్ మారుస్తూ అటు రొమాంటిక్ ఇటు ఏమోషనల్ అలాగే ఫోక్ ఏ పాటైనా సరే అవలీలగా తన గొంతులో పలికిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు తను పాట పాడింది అంటే ఎలాంటి పాటైనా సరే ఇట్టే ప్రేక్షకులను అలరించాల్సిందే.

ఇప్పుడు బుల్లితెరపై కూడా సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరైన ఈమె తన పాటలతో సంగీత ప్రపంచాన్నే ఏలుతోంది అని చెప్పవచ్చు. ఇక సింగర్ గా, భార్యగా, మంచి అమ్మాయిగా తన బాధ్యతలను నిర్వహిస్తున్న గీతామాధురి ఎంత మంచి పేరు తెచ్చుకున్నా సరే ఒక చండాలమైన అలవాటు వల్లే కోట్లు నష్టపోయిందట. అయితే ఇటీవల తానే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. గీతా మాధురికి జూదం అలవాటు ఉందట. దానిని ఇప్పుడు అందరూ కెసినో అని అంటున్నారు. అయితే ఈ ఆట సరదాగా ఆడేది కాదు డబ్బులు పెట్టి ఆడే జూద క్రీడ.

ఇందులో ఆమె చాలా డబ్బులు పోగొట్టుకున్నట్లు సమాచారం. అంతేకాదు కెసినో చూడగానే మనసు ఆగక ఉన్న పనులు కూడా పక్కన పెట్టేసి ఇలా ఆడడం వల్ల నష్టం ఎక్కువ జరిగిందని స్వయంగా గీతామాధురి చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇలా ఈ ఆట ఆడి చాలా డబ్బులు పోగొట్టుకోవడంతో ఇక దాని జోలికి వెళ్లకూడదని అనుకుందట. ఏదేమైనా ఒక వ్యసనం ఉంటే ఆ మనిషిని ఆ వ్యసనం బట్టి పీడిస్తుందని.. ఈ రకంగా తాను కూడా ఆ అలవాటుకి బానిసయ్యి కోట్లు కోల్పోయాను అంటూ గీతామాధురి వెల్లడించింది. అందుకే ఇప్పుడు తను ఆ ఆట వైపు వెళ్లలేదని.. ముఖ్యంగా యువత అనేక వ్యసనాలకు బానిస అవుతున్నారు.. ఇలాంటి వాటి జోలికి అసలు వెళ్ళకండి అంటూ కూడా తన అనుభవాలను పంచుకుంది గీతామాధురి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు