Hi Nanna : చీప్ ప్రమోషనల్ స్టంట్… హైప్ కోసం విజయ్ దేవకొండ, రష్మికను వాడుకోవాలా?

సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి కొంతమంది స్టార్ హీరోలను లేదా డైరెక్టర్లను ప్రీ రిలీస్ ఈవెంట్లకు గెస్టులుగా ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియా వేదికగా చాలా వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ ఒక్కోసారి వాళ్లు చేసే వింత వింత ప్రయోగాలు బెడిసి కొట్టి, ట్రోలింగ్ కు గురవుతూ ఉంటారు. తాజాగా నానికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. బుధవారం జరిగిన “హాయ్ నాన్న” ప్రీ రిలీజ్ ఈవెంట్ నానికి లేని తలనొప్పులు తీసుకొచ్చి పెట్టింది. అనుకోకుండా స్క్రీన్ పై విజయ్ దేవరకొండ, రష్మిక ఫోటోలను వేసి ఈవెంట్ కు హాజరైన అందరిని అవాక్కయ్యేలా చేశారు ఈవెంట్ ఆర్గనైజర్స్.

“హాయ్ నాన్న” ఈవెంట్ లో భాగంగా హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ ని యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు అడిగింది. స్క్రీన్ పై ఉన్న ఫోటోలు చూపిస్తూ దీనిపై మీ కామెంట్ ఏంటి అని ప్రశ్నించింది. ఆ సందర్భంలోనే సడన్ గా స్క్రీన్ పై విజయ్ దేవరకొండ రష్మిక బాలి వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలు వేశారు. అది చూసిన మృణాల్ ఏం చెప్పాలో తెలీక నవ్వుతూ ఉండిపోయింది. దీంతో యాంకర్ సుమ అక్కడితో ఆపేయకుండా ఈ ఫోటో పై మీ కామెంట్ ఏంటి అని మరీ మరీ అడిగింది. దీంతో మృణాల్ ‘వెకేషన్ మోడ్ ఆన్’ అని చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

దీంతో “హాయ్ నాన్న” ఈవెంట్లో విజయ్ దేవరకొండ రష్మిక ఫోటోలు వాడాలి అన్న దరిద్రపు ఆలోచన చేసిన ఆ మహానుభావుడు ఎవరో అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొంతమంది మాత్రం నాని టీం నుంచి ఇది చీఫ్ ప్రమోషనల్ స్టంట్. తన సినిమా కోసం విజయ్ దేవరకొండ రష్మికను వాడుకోవాలా? వాళ్లను వాడుకుని సినిమాను ప్ చేసుకోవడం కన్నా సైలెంట్ గా ఉంటేనే బాగుండేది అంటూ ఫైర్ అవుతున్నారు. నాని ఫ్యాన్స్ మాత్రం ఈవెంట్ ఆర్గనైజర్స్ చేసిన తప్పుకు నానిని ఎందుకు నిందిస్తున్నారు? అసలు నానికి ఈ విషయం గురించి ముందే తెలిసి ఉండకపోవచ్చు అంటూ కవర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాగా శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా మృణాల్ హీరోయిన్ గా నటించిన “హాయ్ నాన్న” మూవీ డిసెంబర్ 7న థియేటర్లలోకి రాబోతోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు