Anasuya: యానిమల్ చిత్రంతో వివాదంలో చిక్కుకున్న అనసూయ.. ఏమైందంటే.?

ప్రముఖ బుల్లితెర గ్లామర్ క్వీన్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు బుల్లితెర షో లు మరొకవైపు సినిమాలు అంటూ భారీ పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై స్పందించే ఈమె ఎప్పటికప్పుడు ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా యానిమల్ చిత్రంతో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే అనసూయకి.. యానిమల్ చిత్రానికి మధ్య సంబంధం ఏమిటి అనే విషయం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటిలాగే ఈసారి కూడా తాజాగా తన ఫోటోలను షేర్ చేసింది. చీరకట్టులో కొంటెగా కసి చూపులతో కుర్ర హృదయాలను తగలబెట్టే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. సోఫాలో కూర్చుని కన్నుగీటుతూ .. చిలిపి చేష్టలతో హొయలు పోతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఆ ఫోటోలను షేర్ చేస్తూ..” నేను వండర్ ఉమెన్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ క్యాప్షన్ కాస్త ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు ఒకవైపు ఆమె ఫోటోలకు ఆసక్తికర కామెంట్లు చేస్తూనే.. మరొకవైపు విభిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.. కొంతమంది నెటిజన్లైతే అనసూయని టార్గెట్ చేసి మరి యానిమల్ చిత్రంతో ముడి పెడుతూ ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం.

వాస్తవానికి గతంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రం ఏ విధంగా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలోని బోల్డ్ సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో వివాదం సృష్టించింది అనసూయ. అంతే కాదు విజయ్ దేవరకొండపై రకరకాల కామెంట్లు చేసి విరుచుకుపడింది. ఇక మొన్నటి వరకు కూడా అనసూయ, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య వివాదం , మాటల యుద్ధం కొనసాగడం మనం చూసాం.. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రం లైగర్ సినిమా విడుదలైన సమయంలో కూడా అనసూయ, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య పెద్ద మాటలు యుద్ధమే జరిగింది.

- Advertisement -

ఇక ఇప్పుడు డిసెంబర్ 1 సందీప్ కొత్త చిత్రం రణబీర్ హీరోగా వచ్చిన యానిమల్ విడుదల అవ్వగా.. ఈ చిత్రంలో కూడా అసభ్యకరమైన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. దీంతో నెటిజన్లు అనసూయని ఈ వివాదంలోకి లాగుతూ యానిమల్ చిత్రం చూడలేదా? ఇందులో అసభ్యకరమైన సన్నివేశాలు కనిపించలేదా? ఒకవేళ కనిపించినా వాటిపై స్పందించవా? అంటూ మండిపడుతున్నారు. మరికొంతమంది అనసూయ.. విజయ్ దేవరకొండ సినిమా అయితేనే ఎక్కేస్తుంది మిగిలిన వాళ్ళు పట్టించుకోదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు