Telugu Actress: రెజీనా పని అయిపోయినట్టేనా?

రెజీనా కాసాండ్రా.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని దక్కించుకున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. అందం, అభినయం ఉన్నా రెజీనా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఇప్పటివరకు ఈ భామ స్టార్ హీరో పక్కన ఒక్క ఛాన్స్ కూడా దక్కించుకోలేకపోయింది. నటనలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా రెజీనాకు మంచి ఆఫర్లు రాలేదనే చెప్పాలి. ఇప్పటికీ తన కెరీర్ ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు ఈ ముద్దుగుమ్మకు.

ఈమె తెలుగులో నటించిన మొదటి సినిమా శివ మనసులో శృతి. ఈ సినిమాతో ఘట్టమనేని కుటుంబం నుండి సుధీర్ బాబు హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంతో రెజీనాకి మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, ఆచార్య, శాకిని డాకినీ వాటి చిత్రాలలో నటించి మెప్పించింది. వీటిలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమా రెజీనాకి మంచి బ్రేక్ ఇచ్చింది.

ఆ తరువాత తేజ్ తోనే కలిసి ఈ ముద్దుగుమ్మ సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో మరోసారి జత కట్టింది. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ లవ్ లో ఉన్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు రెజీనా కెరియర్ ఒక్కసారిగా స్లో అయిపోయి చాన్సులు తగ్గాయి. ఆ తరువాత ఆచార్య సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది రెజీనా. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఈమె ఐటెం సాంగ్స్ కి కూడా పనికిరాదని.. ఇక ఈమెకు అవకాశాలు ఇచ్చినా దండగ అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు