Regina: పో**** స్టార్ అవ్వాలనుకున్నాను.. కానీ.. రెజీనా బోల్డ్ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి 2012లో శివ మనసులో శృతి అనే సినిమా ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ద్వారా ఉత్తమ మహిళ అరంగేట్రం విభాగంలో సైమా అవార్డును కూడా సొంతం చేసుకుంది.

తమిళంలో 2005 వ సంవత్సరంలోనే తమిళ చిత్రం కంద నాల్ ముదల్ అనే చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా (2019) అనే మూవీ తో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం కూడా చేసింది.

తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ దక్కించుకున్న ఈమె అనుకోకుండా అవకాశాలను కోల్పోయింది. దాంతో ఓటీటీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా షాకిని డాకిని అనే వెబ్ సిరీస్ కూడా చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ్ కే పరిమితమైన రెజీనా ఇటీవల అక్కడ ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు షాకింగ్ కామెంట్లు చేసింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా తాను ఒకానొక సమయంలో పోర్న్ స్టార్ కావాలని కోరుకుందట. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్గా అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అనేది అంత సులభమైన పని కాదు. కానీ ఒకసారి సక్సెస్ అయ్యారు అంటే ఇక వారి ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది.

అయితే కేవలం కొంతమందికి మాత్రమే ఇలాంటి అదృష్టం వరిస్తుంది ఇకపోతే హీరోయిన్ అవ్వాలి సక్సెస్ అవ్వాలని చాలామంది అనుకుంటారు కానీ పోర్న్ స్టార్ అవ్వాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇలా పోర్న్ స్టార్ అవడం వల్ల గుర్తింపు వస్తుందో లేదో తెలియదు కానీ విమర్శలు మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఎవరు కూడా ఆ వైపుగా వెళ్లడానికి ఇష్టపడరు.

కానీ తాజాగా రెజీనా ఇలాంటి కామెంట్లు చేయడంతో ప్రస్తుతం అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెజీనాకు ఇంటర్వ్యూలో భాగంగా సినిమాలలో బోల్డ్ సన్నివేశాలు చేయడంపై ప్రశ్న ఎదురవ్వగా ఆమె మాట్లాడుతూ.. నేను గ్లామర్ హీరోయిన్ గా కనిపించడానికి అసలు ఇబ్బంది పడను. అలా చేయడం నాకు చాలా ఇష్టం.

బోల్డ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు చేయాలని ఉంది. నా చిన్న వయసులో నేను సినిమా స్టార్ కి పోర్న్ స్టార్ కి పెద్దగా తేడా తెలియక కొందరి మాటలు విని నేను కూడా పోర్న్ స్టార్ అవ్వాలని అనుకునేదాన్ని. తర్వాత నాకు పోర్న్ స్టార్ అంటే ఏంటో తెలిసి ఆశ్చర్యపోయాను.అందుకే సినిమాల లోకి వచ్చాను. ఇక్కడ బోల్డ్ సన్నివేశాలలో నటించడం అనేది కేవలం కథలో ఒక భాగమే .. అందుకే దానిని నేను ఎంజాయ్ చేస్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు