Regina Cassandra News: ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన హీరో… అందుకే కెరీర్ డౌన్

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా.. సుధీర్ బాబు హీరోగా వచ్చిన శివ మనసులో శ్రుతి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన రెజీనా, మిడ్ రేంజ్ హీరోలకు మంచి ఆప్షన్ గా ఎదిగింది. తన కెరీర్ లో అల్లు శిరీష్, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలతో సినిమాలు చేసింది. ఓ సందర్భంలో హిట్స్, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా ఈమెకు అవకాశాలు వచ్చాయి.

కానీ, సడన్ గా ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో విలన్ పాత్రలు, వెబ్ సిరీస్ ల్లో రాణిస్తుంది. కానీ, కొన్ని రోజుల క్రితం రెజీనా కాసాండ్రా ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయింది అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. దీనికి ఒక కారణం ఉంది అంటూ ఓ టాక్ కూడా వస్తుంది. రెజీనాను ఒక తమిళ హీరో శారీరకంగా వాడుకుని, ప్రెగ్నెంట్ చేశాడట. పెళ్లి విషయానికి వచ్చే సరికి నో – పెళ్లి అంటూ మోసం చేశాడట.

దీంతో రెజీనా డిప్రెషన్ లోకి వెళ్లిందని, తర్వాత రెజీనా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ రెజీనాను వెకేషన్స్ కి తీసుకెళ్లడం, పార్టీలకు తీసుకెళ్లడం లాంటివి చేయడం వల్ల కోలుకుని ప్రస్తుతం సినిమాలు చేస్తుందని తెలుస్తోంది. అయితే ఆ తమిళ హీరో ఎవరో అనేది మాత్రం క్లారిటీ లేదు.

- Advertisement -

కాగా, ముందుగా రెజీనా సాయి ధరమ్ తేజ్ తో లవ్ లో ఉందని ఒక సారి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సందీప్ కిషన్ తో రిలేషన్ షిప్ లో ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిపై రెజీనా ఎప్పటికప్పుడు స్పందిస్తూ రూమర్స్ అంటూ అన్నింటిని కొట్టిపారేసింది. మరీ ఇప్పుడు తమిళ హీరో అంటూ వస్తున్న వార్తలపై రెజీనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు