Prema Pusthakam: అజిత్ ఫస్ట్ మూవీ తెలుగులో చేశాడా?

అజిత్ కుమార్.. హైదరాబాద్ లో పుట్టి పెరిగి కోలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్న అజిత్ కుమార్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. రీసెంట్ గా తునివు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అజిత్ తన తదుపరి సినిమాలతో తీరిక లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే అజిత్ కుమార్ ఇంత స్టార్ డమ్ అనుభవిస్తున్నా ఏనాడూ బయట సోషల్ మీడియా లో కనిపించలేదు. ఫంక్షన్ లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు కుడా ఆయన హాజరవ్వరు. అయితే అజిత్ నటుడుగా పరిచయమైంది ఒక తెలుగు సినిమా తోనే అని ఎంతమందికి తెలుసు? అవును అజిత్ కుమార్ హీరోగా మొదటగా నటించింది తెలుగు చిత్రంలోనే.

1992 లో ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీ రావు తనయుడు శ్రీనివాస్ దర్శకుడుగా “ప్రేమ పుస్తకం” అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోగా అజిత్ కుమార్ నటించగా హీరోయిన్ గా కాంచన్ నటించింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉండగా దర్శకుడు శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా కనుమూశాడు. కాబట్టి ఈ సినిమాకు కొంత కలం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత గొల్లపూడి మారుతీరావు మిగిలిన భాగానికి దర్శకత్వం వహించారు.

జులై 16 1993 లో ఈ సినిమా విడుదలై విజయం సాధించింది. ఈ సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో గొల్లపూడి మారుతీ రావు నంది అవార్డుని గెలుచుకున్నారు. ఈ విధంగా అజిత్ తెలుగులో పరిచయమయ్యాడు. ఈ షూటింగ్ జరుగుతుండగా దర్శకుడి మృతి వల్ల షూటింగ్ గ్యాప్ రాగా, ఆ గ్యాప్ లో అమరావతి అనే తమిళ సినిమా చేశాడు అజిత్. ఆ సినిమా 1993 జూన్ 4 న విడుదలయింది. అఫిషియల్ గా ఆ సినిమాయే ముందొచ్చినా నెల రోజుల గ్యాప్ తో వచ్చిన “ప్రేమ పుస్తకం” సినిమాయే లెక్కలోకి వస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు