Tollywood : దేవరతో పోటీకి సై అంటున్న చై?

టాలీవుడ్ లో సంక్రాంతి పండగ పోటీ అయిపొయింది. కాబట్టి సమ్మర్ బరిలో పోటీకి రెడీ అయ్యారు చాలా మంది హీరోలు. లాస్ట్ ఇయర్ నుండే పెద్ద హీరోల మొదలుకొని మీడియం చిన్న హీరోల సినిమాల దాకా రిలీజ్ డేట్లు ముందే అనౌన్స్ చేసారు. అయితే అనూహ్యంగా సమ్మర్ నుండి ఒక్కో సినిమా తప్పుకుని వాయిదా పడుతూ వేరే రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నాయి. కారణాలు ఏవైనా వాయిదాలు మాత్రం పడుతున్నాయి. ఇక రీసెంట్ గా దేవర సమ్మర్ నుండి తప్పుకుని దసరా రిలీజ్ కి రెడీ అయ్యిందని తెలిసిందే.

అయితే తాజాగా దసరా బరిలో మరో సినిమా నిలవబోతుందని తెలుస్తుంది. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న తండేల్ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన చందు మొండేటి ఈ విషయాన్నీ రివీల్ చేసాడు. తండేల్ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు. అయితే రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. అయినా దసరా కి రిలీజ్ అన్నాడంటే దేవర కి ఒకరోజు ముందు లేదా వెనుక రావొచ్చు. ఇక దేవర అక్టోబర్ 10న రాబోతున్నాడు.

అయితే ఇప్పటివరకు నాగ చైతన్య ఎన్టీఆర్ పెద్దగా పోటీ పడింది లేదు. ఈ రెండు సినిమాలపై ఇండస్ట్రీ లో వాటి వాటి రేంజ్ కి తగ్గట్టు క్రేజీ అంచనాలు ఉన్నాయి. టాక్ ని బట్టి రెండు సినిమాలు దుమ్ములేపే ఛాన్స్ ఉంది. ఇక కొందరు హీరోల రేంజ్ ని బట్టి మాట్లాడినా, వారికి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలే సమాధానం. ఇక దేవరను కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించగా, తండేల్ ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు సముద్ర తీర నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. అయితే తండేల్ రిలీజ్ డేట్ మాత్రం మేకర్స్ నుండి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు